For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బడా డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ పట్టేసిన రాహుల్.. మరో బిగ్ బాస్ కంటెస్టెంట్‌తో కలిసి కీ రోల్.!

By Manoj
|

రాహుల్ సిప్లీగంజ్.. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు మారుమ్రోగిపోతోంది. దీనికి కారణం అతడు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్‌ -3 విజేతగా నిలవడమే. సాధారణ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరైన రాహుల్.. తన మేనరిజం, నిజాయితీతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. దీంతో వారంతా అతడికి పట్టం కట్టారు. వాస్తవానికి సింగర్‌గా ఎంతో పేరు సంపాదించుకున్నప్పటికీ, బిగ్ బాస్ గెలిచిన తర్వాతనే అతడి పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా రాహుల్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

అవే రాహుల్‌ను నిలబెట్టాయి

అవే రాహుల్‌ను నిలబెట్టాయి

రాహుల్.. ఓ టీవీ చానెల్‌లో ప్రసారం అయిన సింగింగ్ కాంపిటీషన్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశం దక్కించుకుని ప్లే బ్యాక్ సింగర్‌గా నిలదొక్కుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ యువతను ఉర్రూతలూగిస్తున్నాడు. అతడి నుంచి వచ్చిన అన్ని అల్బమ్స్ సూపర్ హిట్ అయ్యాయి.

హైదరాబాదీ పోరడికి ఫుల్ ఫాలోయింగ్

హైదరాబాదీ పోరడికి ఫుల్ ఫాలోయింగ్

ప్రైవేటు సాంగ్స్ చేస్తున్న క్రమంలో రాహుల్.. యూత్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్స్ అందుకునే వాడు. అంతేకాదు, టాలీవుడ్‌లో ప్లే బ్యాక్ సింగర్ అయినప్పటికీ హైదరాబాద్‌లోని కుర్రాళ్లతో కలిసిపోయి ఉంటాడని లోకల్ యూత్ చెబుతుంటుంది. ఇదే.. రాహుల్ ఎదుగుదలకు బాగా ఉపయోగపడిందని కూడా చాలా మంది అంటుంటారు.

#CineBox : Prabhas To Have Dual Role In His Next Period Drama 'Jaan' ?
కెరీర్‌ను మలుపు తిప్పిన షో

కెరీర్‌ను మలుపు తిప్పిన షో

ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన రాహుల్‌కు సింగర్‌గా మంచి పేరు వచ్చింది. ఇక, బిగ్ బాస్ షో తర్వాత అతడి పేరు ప్రతి ఇంటికీ తెలిసిపోయింది. బయట అతడు ప్రవర్తించే తీరు వల్లే బిగ్ బాస్ విజేతగా నిలిచాడన్న టాక్ కూడా ఉంది. ఈ షో తర్వాత రాహుల్ క్రేజ్ అమాంతం పెరిగిపోవడంతో సింగర్‌గా, యాక్టర్‌గా పలు అవకాశాలు దక్కించుకుంటున్నాడు.

బడా డైరెక్టర్ సినిమాలో ఛాన్స్

బడా డైరెక్టర్ సినిమాలో ఛాన్స్

ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న రాహుల్ సిప్లీగంజ్‌కు బడా డైరెక్టర్ సినిమాలో అవకాశం వచ్చిందని తాజాగా ఓ వార్త ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన ఎవరో కాదు.. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ. అవును.. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలో రాహుల్‌కు ఛాన్స్ వచ్చిందట. ఓ ముఖ్య పాత్ర కోసం ఈ యంగ్ సింగర్‌ను తీసుకున్నారని సమాచారం.

మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా..

మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా..

ఇక, ఇదే సినిమాలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన అలీ రేజా కూడా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని అతడే రెండు రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అంతేకాదు, షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశాడు. ఇప్పుడు రాహల్.. అతడితో కలిసి నటించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.

నటుడి గురించే సినిమా

నటుడి గురించే సినిమా

మరాఠిలో ఘన విజయం సాధించిన ‘నట సామ్రాట్‌' సినిమాను తెలుగులో ‘రంగమార్తండ' పేరుతో రీమేక్‌ చేస్తున్నాడు కృష్ణవంశీ. బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ ప్రధాన పాత్రలో నటుడు, దర్శకుడు మహేష్‌ మంజ్రేకర్‌ దతెరకెక్కించిన ఈ సినిమాను నానా పటేకర్‌, విశ్వాస్‌ జోషీలు సంయుక్తంగా నిర్మించారు. చిన్న సినిమాగా తెరకెక్కిన ‘నట సామ్రాట్‌' రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

English summary
Prakash Raj will play the titular role in ‘Rangamarthanda’ whereas Ramya Krishna will be seen as his wife, while Brahmanandam will be seen as a friend. ‘Rangamarthanda’ is all about the story of a theatre stalwart entangled in the shackles of his characters battles personal problems after retiring from acting.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more