»   » వర్మ మూకీ సినిమా చేసేది ఈ కుర్ర హీరోనే

వర్మ మూకీ సినిమా చేసేది ఈ కుర్ర హీరోనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రీసెంట్ గా ‘సినిమా చూపిస్త మామ' అంటూ అలరించిన రాజ్ తరుణ్ తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్టు ఓకే చేసారని సమాచారం. ఈ సారి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు వినికిడి. ఆ మధ్య వర్మ ప్రకటించిన మూకి సినిమాలో రాజ్ తరుణ్ అయితే సెట్ అవుతాడని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు.

ఇది పూర్తిగా పుష్పక విమానం తరహా ప్రయోగాత్మక చిత్రం. రాజ్ తరణ్ లో ఎక్సప్రెషన్స్ బాగా పలుకుతూండటంతో అతన్ని తీసుకోవటానికి వర్మ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.ఇక ఈ చిత్రం పేరు 'సైలెంట్'!.

Raj Tarun in RGV direction?

దీని గురించి వర్మ మాట్లాడుతూ.. సినిమా అనేది దృశ్య, శబ్ద సమ్మిళితంగా వుంటుందన్నారు. అయితే, సినిమాను కనుగొన్న మొదట్లో కేవలం దృశ్యం మాత్రమే వుండేదని, తర్వాత శబ్దం జతకలిసిందన్నారు.

మూకీ సినిమాల శకం ముగిసిపోయి అరవై ఏళ్ల తర్వాత, విలక్షణ నటుడు కమల్ హాసన్‌తో సింగీతం శ్రీనివాసరావు 'పుష్పక విమానం' తీసి అందర్నీ ఆశ్చర్యపరచారని గుర్తుచేశారు. ఆ తర్వాత మళ్లీ మూకీ సినిమా రాలేదని తెలిపారు.

Raj Tarun in RGV direction?

సినిమాలో సౌండుకి ఎంత ప్రాధాన్యత వుందో, నిశబ్దానికి కూడా వుందని అభిప్రాయపడ్డారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు 'సైలెంట్' పేరుతో కంప్లీట్ మూకీ సినిమా తీస్తున్నానని తెలిపారు. ఇది క్రైమ్, కామెడీ తెరకెక్కుతుందన్నారు. ఇందులో భాష వుండదు కాబట్టి ఇది పలు భాషల్లో విడుదల చేస్తానని వర్మ వెల్లడించారు.

English summary
Rumours are spreading that Raj Tarun will be starring under the direction of Ram Gopal Varma. Buzz is, it will be an experimental film with no dialogues in it.
Please Wait while comments are loading...