»   » రాజమౌళి కండీషన్ తో ఓ ప్రముఖ నిర్మాత స్టార్ హీరో కోసం పడరాని పాట్లు..!?

రాజమౌళి కండీషన్ తో ఓ ప్రముఖ నిర్మాత స్టార్ హీరో కోసం పడరాని పాట్లు..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ రంగానికి చెందిన ఓ ప్రముఖ నిర్మాత ఇటీవల రాజమౌళిని కలిసాడట. ఈ సంచలన దర్శకుడి దర్శకత్వంలో సినిమా నిర్మించాలని ఉందని చెప్పాడట. చేయడానికి అభ్యంతరం లేదు..కానీ విక్రమ్ డేట్స్ తీసుకుంటే అతను హీరోగా మీకు సినిమా చేసి పెడతా అని సదురు నిర్మాతకు రాజమౌళి కండీషన్ పెట్టాడట. విక్రమ్ తో సినిమా చేయాలనే కోరికతో రాజమౌళి ఈ ప్రతిపాదన పెట్టి ఉంటాడు. ఇప్పుడు ఆ నిర్మాత విక్రమ్ డేట్స్ సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాడట.

కాగా తెలుగులో ఒక స్ట్రెయిట్‌ చిత్రం చేయాలని తమిళ స్టార్‌ విక్రమ్‌ కూడా చాలా పట్టుదలతో ఉన్నాడని సమాచారం. దీంతో రాజమౌళితో విక్రమ్‌ తదుపరి చిత్రం ఉండబోతోందనే వార్తలకు బలం చేకూరుతోంది. అందుకు తగ్గట్టే విక్రమ్‌ ఆహ్వానం మేరకు ఆయనను ఆమధ్య లడక్ ‌లో రాజమౌళి కలుసుకున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి ఓ స్క్రిప్టు సైతం వినిపించారని, ప్రస్తుతం విక్రమ్‌, రాజమౌళి అంగీకరించిన ప్రాజెక్టులు పూర్తికాగానే ఈ సూపర్‌ కాంబినేషన్‌ సెట్స్‌పైకి వస్తుందని తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu