»   » రాజమౌళి ఈగ కోసం 2కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి సెట్

రాజమౌళి ఈగ కోసం 2కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి సెట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అష్టా చెమ్మా ఫేం నాని, సమంత కాంబినేషన్ లో రాజమౌళి ఈగ అనే యానిమేషన్ సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రం కోసం 2కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి సెట్ రూపోందిస్తున్నారని సమాచారం. సినిమాకి సంబంధించిన 85శాతం షూటింగ్‌ని ఈ సెట్‌లోనే చిత్రీకరిస్తారని సమాచారం.

సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈసినిమాకి హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలకు ఛాయాగ్రాహాకుడిగా వ్యవహారించిన జేమ్స్ పౌల్ ఈసినిమాకి కెమెరా మ్యాన్ గావ్యవహారిస్తున్నారు. ఈగ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ నటుడు సుదీప్ విలన్‌ గా నటిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu