»   » జూ ఎన్టీఆర్ కల నెరవేరాలంటే దమ్మున్న నిర్మాత దొరకాలి....!

జూ ఎన్టీఆర్ కల నెరవేరాలంటే దమ్మున్న నిర్మాత దొరకాలి....!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం చలామణిలో వున్న అగ్ర దర్శకుల్లో పౌరాణికాల్ని అద్భుతంగా తెరకెక్కించగల సామర్థ్యం వున్న దర్శకుడిగా రాజమౌళికే ఎక్కు వ ఓట్లు పడుతున్నాయి. కానీ పౌరాణిక చిత్రమైన దానవీరశూరకర్ణ" చిత్రాన్ని జూ ఎన్టీఆర్ తో రీమేక్ చేయలేనని రాజమౌళి ప్రకటించడంతో దానికి కారణాలు తెలీయక జూ ఎన్టీఆర్ అభిమానులు బిక్కమొహాలేశారు. అయితే తాను ఈ పౌరాణిక చిత్రం ఎందుకు తెరకెక్కించడంలేదో తెలుపుతూ తన ఊహలకి తగ్గట్టుగా ప్రస్తుతమున్న సాంకేతిక నైపుణ్యమంతా వాడుకుని పౌరాణికాలు తీయాలంటే తనకు కనీసం ఎనబై కోట్ల రూపాయల బడ్జెట్ అవసరమని, అంత బడ్జెట్ తో తెలుగు సినిమా తీస్తే సక్సెస్ అవుతుందో కాదో అని, దానిని తగ్గించడానికి స్కోప్ వుందేమోనని ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నానని రాజమౌళి చెప్పాడు.

రాజమౌళి అయితే ఒక ఫింగర్ చెప్పేశాడు. దానిని తగ్గించడానికి అతను ప్రయత్నిస్తున్నానని అంటున్నా, ఒకవేళ అతను అలాంటి సినిమా చేస్తే అంత బడ్జెట్ అవ్వకమానదు. కనుక దానవీరశూరకర్ణ సినిమా చేయాలనే ఎన్టీఆర్ కల తీరాలంటే రాజమౌళి కట్టిన ఎనభై కోట్ల వెల పెట్టగలిగే దమ్మున్న నిర్మాత దొరకాలి. అది జరగాలంటే మనం కొన్నేళ్లు ఆగక తప్పదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu