»   » రాజమౌళి, ప్రభాస్ కొత్త సినిమా బ్యాక్ డ్రాప్ అదా?

రాజమౌళి, ప్రభాస్ కొత్త సినిమా బ్యాక్ డ్రాప్ అదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందించనున్న చిత్రం బ్యాక్ డ్రాప్ స్వాతంత్ర్య సమరం అంటూ వినపడుతోంది. ఈ మేరకు విజయేంద్రప్రసాద్ ఓ కథ రెడీ చేసారని, రాజమౌళి దానిపై కసరత్తలు చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.కథా కాలం 1930-40 ల మధ్య జరుగుతుందని అంటున్నారు. చారిత్రకమైన స్వాతంత్ర్య ఉద్యమాన్ని బేస్ చేసుకుని అప్పటి కాలపు ఓ వీరుడు కథను తెరకెక్కించబోతున్నట్లు చెప్తున్నారు. చంత్రపతి తర్వాత చేస్తున్న కాంబినేషన్ కావటంతో బిజెనెస్ పరంగానూ ట్రేడ్ లో బాగా వర్కువుట్ అవుతుందని..భారీ బడ్జెట్ కేటాయించనున్నట్లు చెప్తున్నారు. 2011లో ఈ చిత్రం రిలీజ్ చేసేలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రాజమౌళి..సునీల్ కాంబినేషన్లో మర్యాద రామన్న చిత్రం రూపొందుతోంది. దశరధ్ తోనూ, కరుణాకరన్ తో ప్రభాస్ చిత్రాలు చేస్తున్నాడు. కరుణాకరన్ తో చేసే చిత్రం పేరు డార్లింగ్. ఇక ఇంతకు ముందు పూరీ, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఏక్ నిరంజన్ భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కాబట్టి ఈ రెండింపైనే పూర్తి స్ధాయిలో ప్రభాస్ దృష్టి పెట్టినట్లు చెప్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu