జక్కన్న దెబ్బ.. టెన్షన్లో పుష్ప యూనిట్.. మళ్ళీ మొదటికి?

ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాల చిత్రీకరణ పెరిగిపోయింది. దాదాపు అరడజనుకు పైగా స్టార్ హీరోలు ఉన్న నేపథ్యంలో వారి మార్కెట్ కి తగ్గట్టుగానే సినిమాల నిర్మాణ విలువలు కూడా పెరిగాయి. తెలుగు సహా భారతదేశంలో అన్ని భాషల ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది ఆర్ఆర్ఆర్ అని చెప్పక తప్పదు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కరోనా కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ పుష్ప సినిమా మేకర్స్ లో టెన్షన్ లో పెట్టినట్లు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

 ఆర్ఆర్ఆర్ రిలీజ్ టెన్షన్

ఆర్ఆర్ఆర్ రిలీజ్ టెన్షన్

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా ప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా గత ఏడాది రిలీజ్ కావాల్సి ఉంది.. కానీ కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాను 2021 అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

అందుకే వాయిదా పడుతుందని

అందుకే వాయిదా పడుతుందని

అయితే కరోనా రెండో దశ కారణంగా మళ్లీ షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల 2022 జనవరి లేదా 2022 సమ్మర్ కి వాయిదా వేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున టాక్ వినిపించింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. అయితే ఈ రోజు ఈ అంశం మీద ఒక క్లారిటీ వచ్చింది.

వాయిదా పడని ఆర్ఆర్ఆర్

వాయిదా పడని ఆర్ఆర్ఆర్

ఈరోజు ఉదయం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్‌కు సంబంధించిన లుక్ విడుద‌లైంది. ఆయుధాన్ని గురిపెట్టి నీళ్ల‌లోంచి దూసుకొస్తోన్న ఎన్టీఆర్ ఫోజ్ అలరిస్తోంది. ఈ సినిమాలో కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన‌రోజును పురస్కరించుకుని ఈ లుక్‌ను ఆ సినిమా బృందం విడుద‌ల చేసింది.

బంగారం లాంటి మ‌న‌సు ఉన్నా భీమ్‌ తిరుగుబాటు మొద‌లు పెట్టాడంటే ఎంతో ధైర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తాడ‌ని రాజ‌మౌళి పేర్కొన్నారు. ఇక ఈ ఫోటోలో సినిమా రిలీజ్ డేట్ కూడా మార్చకుండా పాత డేట్ ఉంచారు.

ఆర్ఆర్ఆర్ స్లాట్ కి ఫిక్స్ అయిన పుష్ప

ఆర్ఆర్ఆర్ స్లాట్ కి ఫిక్స్ అయిన పుష్ప


అయితే రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ విడుదలను 2022కి వాయిదా చేస్తే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో చేస్తున్న 'పుష్ప' ని 2021 అక్టోబర్ 13 న విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. నిజానికి ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 13 న విడుదల చేస్తామని అన్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల కారణంగా విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ వాయిదా పడితే ఆ స్లాట్ తీసుకోవాలని అనుకున్నారు.

Recommended Video

Jr NTR, Man Of Masses తారక్ ని Troll చేసేవాళ్ళు చూడాల్సిన వీడియో | #KomarbheemNTR | Filmibeat Telugu
అంతా రివర్స్

అంతా రివర్స్


కానీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అదే సమయానికి వస్తామని ప్రకటించడంతో అల్లు అర్జున్ పుష్ప మేకర్స్ ను గందరగోళంలోకి నెట్టివేసింది. పుష్ప యూనిట్ ఇటీవలే రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇక మొదటి భాగం అక్టోబర్ 13 న విడుదల చేయాలని ఫిక్స్ అయిన క్రమంలో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ప్రకటనతో సందిగ్దంలో పడినట్టు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X