twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మేము సైతం' కోసం 'బాహుబలి' టీమ్ ఇలా...

    By Srikanya
    |

    హైదరాబాద్ :సినీ తారలంటే చెప్పలేనంత క్రేజ్‌. మనకు ఇష్టమైన హీరోని తెరపై చూసుకొంటే పండగలా ఉంటుంది. ఇక వాళ్లని ప్రత్యక్షంగా చూస్తే! ఆటపాటలతో సరదాగా గడిపితే! 'వావ్‌' అనిపిస్తోంది కదూ. ఈ అవకాశం సామాన్య ప్రేక్షకులకు 'మేము సైతం' కార్యక్రమం ద్వారా కల్పిస్తోంది తెలుగు చిత్రసీమ. హుద్‌ హుద్‌ తుపాను బాధితులను ఆదుకోవడానికి మేము సైతం అంటూ చేయి చేయి కలిపింది టాలీవుడ్‌.

    ఈనెల 30వ తేదీన ఏకధాటిగా 12 గంటల పాటు వినోద కార్యక్రమాలను నిర్వహించబోతోంది. క్రికెట్‌, కబడ్డీ, గేమ్‌షోలూ, అంత్యాక్షరి, స్కిట్స్‌.. ఇలా ఎన్నెన్నో సరదాలు. ఈ కార్యక్రమాల్లో భాగంగా..రాజమౌళి కూడా ఓ స్కిట్ ని రెడీ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. బాహుబలి టీమ్ ...ప్రభాస్,అనుష్క, రానా, కీరవాణి, తమన్నా తదితరులతో ఈ స్కిట్ ఉండబోతోందని చెప్తున్నారు. అలాగే ఈ స్కిట్ పీరియడ్ డ్రామా ఉండే అవకాసం ఉందని చెప్తున్నారు. ఈ స్కిట్ కి రాజమౌళి డైరక్ట్ చేయనున్నారు.

    Rajamouli's Baahubali Team's Special Skit

    ఇక మేము సైతం పోగ్రాం వివరాలికి వస్తే...

    ఈ పోగ్రాంలో 'తంబోలా' ఆట బాగా డిజైన్ చేసారని తెలుస్తోంది. అంకెలతో సాగే సరదా ఆట ఇది. ఈసారి స్టార్స్‌తో కలసి ఆడడమే... 'తంబోలా' ప్రత్యేకత. ఈనెల 30వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 8.30 నిమిషాల వరకూ ఈ గేమ్‌షోని నిర్వహిస్తారు.

    ఇందుకు సంబంధించిన కూపన్లు హైదరాబాద్‌ ఫిల్మ్‌ఛాంబర్‌, ఎఫ్‌ఎన్‌సీసీ, అన్ని మల్టీప్లెక్స్‌ థియేటర్లలోనూ, గేటెడ్‌ కమ్యునిటీ సెంటర్లలోనూ, జింఖానా, సికింద్రాబాద్‌ క్లబ్బులలోనూ లభిస్తాయి. వెల రూ. 15 వేలు. కేవలం రెండు వేల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒకొక్క టికెట్‌తో ఇద్దరికి ప్రవేశం కల్పిస్తారు. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందచేస్తారు.

    భారీ బహుమతులు: తారలతో ఆడే ఈ 'తంబోలా' ఆటలో విలువైన బహుమతులూ ఉన్నాయి. రూ. 10 లక్షల విలువైన బంగారం, ఓ బీఎమ్‌డబ్ల్యూ కారు గెలుచుకొనే అవకాశం కల్పిస్తున్నారు నిర్వాహకులు. తంబోలా గేమ్‌షో గురించి ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ ''తారల్ని ప్రత్యక్షంగా చూడాలి, వాళ్లతో ఆడిపాడాలి అనుకొనేవారికి ఇదో మంచి అవకాశం.

    దాదాపు కోటి రూపాయలు ఈ తంబోలా ద్వారా సేకరించడం లక్ష్యంగా పెట్టుకొన్నాం. పదిహేను వేలతో కూపన్‌ కొంటే.. తంబోలా ఆడడమే కాదు. ఆరోజు స్టార్లతో పాటు విందులోనూ పాల్గొనే అవకాశం ఉంటుంది. హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్డేడియంలో విందు ఏర్పాటు చేశాం. 'హుద్‌ హుద్‌' బాధితులను ఆదుకోవడానికి చిత్రసీమ చేస్తున్న ఓ మహత్తర కార్యక్రమం ఇది. అందరూ సహకరించాల''న్నారు.

    బాహుబలి విషయానికి వస్తే...

    మనిషి తలచుకుంటే సాధించలేనిది లేదు. అయితే ఆ తలపు అత్యాశతో కూడినదైతే ఆ మనిషికి రేపు అనేది ఉండదు. ఈ అంశంతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. గతంలో రాజుల నేపథ్యంలోనూ ఇలాంటి కథలు తీశారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఇలాంటి అంశంతోనే 'బాహుబలి'ని రూపొందిస్తున్నారు.

    ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రధారులు. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతోంది. హిల్‌ ఏరియా సమీపంలో 'బాహుబలి'...ప్రభాస్‌, 'భళ్లాలదేవుడు' రానాపై పీటర్‌ హెయిన్స్‌ మాస్టర్‌ నేతృత్వంలో పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

    నెలాఖరు వరకు ఇక్కడ చిత్రీకరణ ఉంటుంది. ఈ చిత్రానికి కథ: కె.వి.విజయేంద్రప్రసాద్‌, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సెంథిల్‌ కుమార్‌.

    English summary
    Baahubali team comprising of Prabhas, Anushka, Rana, Keeravani etc. are also performing a special skit on Tollywood’s Mega relief event Memu Saitham . This skit shall be directed by none other than Rajamouli.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X