»   »  ఎన్టీఆర్ కోసం ‘బాహుబలి’ కు బ్రేక్

ఎన్టీఆర్ కోసం ‘బాహుబలి’ కు బ్రేక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్సకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం ఆయన సూపర్ హిట్ ‘బాహుబలి'కు సీక్వెల్ రూపొందుతోంది. ‘బాహుబలి- ది కంక్లూజన్' టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి రాజమౌళి రేపు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రేపు..ఎన్టీఆర్ కెరీర్ లో ప్రెస్టీజియస్ గా రూపొందిన 25 వ చిత్రం నాన్నకు ప్రేమతో విడుదల అవుతోంది.

ఎన్టీఆర్ మీద అభిమానంతోనే కాక, సుకుమార్ కోసం కూడా రాజమౌళి ఈ చిత్రాన్ని చూడనున్నారు. తమ టీమ్ మొత్తంతో ఆయన మార్నింగ్ షో ప్రసాద్ ఐ మ్యాక్స్ల్ లో చూస్తారని తెలుస్తోంది. మొదటినుంచీ సుకుమార్ అంటే రాజమౌళి కు మంచి అభిమానం. క్రితం సంవత్సరం కూడా ఆయన సుకుమార్ డైరక్ట్ చేసిన వన్ నేనొక్కిడినే చిత్రం కోసం టీవీ ఛానెల్స్ కు వచ్చి మరీ ప్రమోట్ చేసారు. దాంతో ఇప్పుడు కూడా అదే విధంగా ఈ చిత్రాన్ని చూసి ఆయన ట్వీట్ చేస్తారా లేదా ప్రమోషన్ లో భాగం అవుతారా అన్నది చూడాలి.


సుకుమార్ తో కలిసి ఎన్.టి.ఆర్ చేసిన 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో'. ఈ సాయింత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి ‘యు/ఏ' సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ కూడా పూర్తి కావటంతో ఖచ్చితంగా ఈ సినిమా జనవరి 13న విడుదల అవుతుందనే విషయం ఖరారు అయినట్లైంది.


సెన్సార్ వారి టాక్ ప్రకారం..సినిమాలో ఎమోషన్ కంటెంట్ బాగుందని, హీరోకి విలన్ కు మధ్య జరిగే మైండ్ గేమ్ హైలెట్ గా ఉందని అంటున్నారు. సెన్సార్ వారు దర్శకుడుని, నిర్మాతను అభినందించినట్లు తెలుస్తోంది.


ఈ సినిమాలో ఎన్టీఆర్ ...లండన్ బేస్డ్ ఎన్నారైగా కనిపిస్తారు. నాన్న చివరి కోరికను నెరవేర్చే కొడుకుగా కనిపిస్తారు. ఆ పాత్రలో వైవిధ్యమైన ఎమోషన్ ఉంటుంది. అది ఎన్టీఆర్ కు కూడా కొత్తే.


Rajamouli takes a break for Naannaku

ఎన్టీఆర్ మాట్లాడుతూ...నాన్నకు ప్రేమతో చాలా సింపుల్, ప్లేన్ స్టోరీ. బేసిక్ ఎమోషన్ ఏంటన్నది సినిమాలోనే చూడాలి. కథైతే కొత్తదని చెప్పను. కథనం మాత్రం చాలా చాలా కొత్తగా ఉంటుంది. తండ్రి-కొడుకుల సెంటిమెంట్‌ను బేస్ చేసుకొని చాలా సినిమాలే వచ్చాయి. ఇందులో అది చాలా కొత్తగా ఉంటుంది. ఆ కొత్తగా ఉండే అంశం ఏంటీ అన్నది మీరే సినిమా చూసి తెలుసుకోవాలి అన్నారు.


రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు.


ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

English summary
Rajamouli is going to take a break from ‘Baahubali’ shooting to watch ‘Nannaku Prematho’ along with ‘Baahubali’ film unit.
Please Wait while comments are loading...