రాజశేఖర్ కూతురు డిసైడ్ అయిపోయిందట.. పొరుగు రాష్ట్రం యువకుడితో శివానీ పెళ్లి?
Recommended Video

టాలీవుడ్‌లో హీరోల వారసులు రంగ ప్రవేశం చేయడమే చూశాం. హీరోల కూతుర్లు హీరోయిన్లుగా వచ్చిన దాఖలాలు కూడా తక్కువే. తాజాగా యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ హీరో కూతురు శివానీ సినీ రంగం ప్రవేశం చేస్తున్నదనే వార్త మీడియాలో అప్పట్లో వైరల్ అయింది. అయితే తాజాగా మరోసారి శివానీ ఎంట్రీ న్యూస్ వైరల్ అవుతున్నది.

తమిళ సినిమాలో
గతంలో ఓ తమిళ చిత్రంలో నటించేందుకు శివానీ అంగీకరించారనే వార్త వచ్చింది. కానీ ఆ వార్త వాస్తవ రూపం దాల్చలేదు. కానీ ప్రస్తుతం తెలుగు చిత్రంలో నటించనున్నారనేది తాజా సమాచారం.

2 స్టేట్స్ చిత్రంలో
బాలీవుడ్‌లో విజయవంతమైన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ జరుగుతున్నది. తాజాగా హిందీలో వచ్చిన 2 స్టేట్స్ అనే చిత్రంలో శివానీ నటిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది.

బాలీవుడ్‌లో ఆలియాభట్
2 కంట్రీస్ చిత్రంలో అర్జున్ కపూర్, అలియా భట్ జంటగా నటించారు. రెండు రాష్ట్రాలు, రెండు విభిన్నమైన సంస్కృతుల ఉన్న కుటుంబాల మధ్య జరిగిన పెళ్లి నేపథ్యంగా కథ సాగుతుంది.

ఉత్తరాది అమ్మాయిగా శివానీ
ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన 2 స్టేట్స్ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో అలియాభట్ పోషించిన పాత్రను శివానీ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో శివానీ ఉత్తరాది అమ్మాయిగా కనిపించే అవకాశం ఉంది.

అడవి శేషు హీరోగా
కాగా, తెలుగులో రూపొందించే 2 స్టేట్స్ చిత్రంలో హీరోగా అడవి శేషు నటించనున్నారు. ఈ చిత్రానికి వీవీ వినాయక్ వద్ద దర్శకత్వం శాఖలో పనిచేసిన వెంకట్ రెడ్డి డైరెక్టర్‌గా పరిచయం కానున్నారు. మిధున్ చైతన్య, మధు శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
గతంలో నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా 2 స్టేట్స్ చిత్రాన్ని తెలుగులో నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగాయి. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేకపోయింది. తాజాగా అడవి శేషు, శివానీ జంటగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











