For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిజమా... హాలీవుడ్ చిత్రం ఎత్తి చేస్తున్నారా?

  By Srikanya
  |

  హైదరాబాద్: యజమాని పట్ల పెంపుడు కుక్కలకు ఉండే విశ్వాసం ఎలాంటిదో చూపించే ఇతివృత్తంతో బాబు పిక్చర్స్‌ సంస్థ టామీ టైటిల్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ ఓ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మిక్కీ (హనీ) అనే కుక్క చుట్టూ ఈ చిత్రకథ తిరుగుతుంది. ఈ చిత్రం హాలీవుడ్ కాపీ అని వినపడుతోంది.

  Rajendra Prasad In Hollywood Freemake

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  రిచ్చర్డ్ గేర్ ప్రధాన పాత్రలో 2009లో వచ్చిన 'Hachiko' చిత్రం కథనే తీస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. విడుదల అయితే కానీ నిజమేమిటనేది తెలియదు. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో మాజీమంత్రి చేగొండి హరిబాబు, బోనం చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

  రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. కుక్క అంటే విశ్వాసానికి మారుపేరు. ఒక మనిషికి, కుక్కకు అన్న అనుబంధం నేపధ్యంలో సాగే సినిమా ఇది. నవ్విస్తూనే చివరకు కంటనీరు తెప్పిస్తుంది. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా ఇది. పిల్లలున్న ప్రతి తల్లిదండ్రుల్ని ఆకట్టుకుంటుంది అన్నారు.

  Rajendra Prasad In Hollywood Freemake

  చేగొండి హరిబాబు మాట్లాడుతూ... 'రాజకీయాల్లో ఉన్నప్పటికీ, సినిమాలు తీయడమన్నది మొదట్నుంచీ నాకు ఓ అభిరుచి. అయితే లాభాపేక్ష కోసం నేనెప్పుడూ సినిమాలను తియ్యలేదు. ఏదోఒక సందేశాన్ని పవర్‌ఫుల్‌ మీడియా అయిన సినిమా ద్వారా చెప్పాలన్నదే నా ఆకాంక్ష. పెంపుడు కుక్కలంటే నాకు చాలా ఇష్టం. పెంపుడు కుక్కపై సినిమాను తియ్యాలని చాలాకాలాంగా అనుకుంటున్నాను. అందుకోసం శిక్షణ పొందిన కుక్కను ఎంపికచేసుకుని, ఈ సినిమాను చేస్తున్నాం. 1925-37ల మధ్య జీవించిన ఓ పెంపుడు కుక్క యథార్థగాథే ఈ సినిమా. మంచి టీమ్‌ కుదిరింది. ' అని అన్నారు.

  దర్శకుడు రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ, 'కుక్క చుట్టూ తిరిగే కథ అనగానే దానిని తెరకెక్కించేందుకు ఎంతో ఓర్పు కావాలి. ఈ విషయంలో నాపై నమ్మకం ఉంచి, నాకు అవకాశం కల్పించిన నిర్మాతకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులో మూడు కుక్కలు నటిస్తున్నాయి. కచ్చితంగా మంచి అవుట్‌పుట్‌ ఇస్తాను' అని చెప్పారు.

  అలాగే... విశ్వాసానికి ప్రతీకగా నిలిచే టామీ అనే ఓ పెంపుడు కుక్క కథే ఈ చిత్ర ఇతివృత్తం. ఆ కుక్కకు, దాని యజమానికి మధ్య ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి?అన్నది ఇందులో ఆసక్తికరంగా ఉంటుంది. ఇంటిల్లిపాది కలిసి చూసే చిత్రమిది. మూగజీవాలపై ప్రతి ఒక్కరు ఆదరణ చూపించాల్సిన అవసరముందనే సందేశాన్ని ఇందులో చక్కగా ఆవిష్కరిస్తున్నాం. రాజేంద్రప్రసాద్ నటన ఆకట్టుకుంటుంది. ఇలాంటి మంచి చిత్రాలకు పన్ను మినహాయింపు అందించి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి అని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి రచన: రాజేంద్రకుమార్‌, సంగీతం: చక్రి, పాటలు: అనంత శ్రీరామ్‌, ఛాయాగ్రాహకుడు: మోహన్‌.

  English summary
  Rajendra Prasad's latest 'Tommy' which revolves around a dog and its loyalty towards its master. Inside sources reveal this is the remake of the famous Hollywood movie 'Hachiko' which came in the year 2009. This has Richard Gere in the lead.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X