»   » రజనీ సరసన హీరోయిన్‌గా డర్టీ ఉమెన్?

రజనీ సరసన హీరోయిన్‌గా డర్టీ ఉమెన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, పా రంజిత్‌ దర్శకత్వంలో నటించనున్న సంగతితెలిసిందే. కలైపులి ఎస్‌ ధాను నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది .ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి థాను ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఆగష్టు ఒకటిన ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ఏమీటీ అంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ విద్యా బాలన్‌ (డర్టీ పిక్చర్ హీరోయిన్ ) ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఇంతకు ముందు రజనీ కాంత్ దీపికా పదుకొనే, సోనాక్షి సిన్హా లతో జతకట్టారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో రజనీ తన వయసుకు సరిపోయే తరహా పాత్రను చేయనున్నట్లు తెలుస్తోంది. ఓ వయసైన గ్యాంగ్‌స్టర్‌గా రజనీ ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Rajinikanth and Vidya Balan star together

ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మలేషియాలో ప్రారంభమనుంది. 60 రోజులు మలేషియాలో షూటింగ్‌ తర్వాత థాయ్‌ల్యాండ్‌, హాంగ్‌కాంగ్‌తోపాటు చెన్నైలో షూటింగ్‌ చేయనున్నట్లు తెలిపారు.

దర్శకుడు విషయానికి వస్తే...

ఇప్పటివరకూ కేవలం రెండు చిత్రాలకే దర్శకత్వం వహించాడు.. అయితేనేం.. తన కథతో బడా ప్రొడ్యూసర్ ను ఒప్పించాడు... కోలీవుడ్ సూపర్ స్టార్ ను మెప్పించాడు. దీంతో రజనీకాంత్ నెక్స్ట్ మూవీకి దర్శకుడయ్యాడు రంజిత్. రజనీకాంత్ తదుపరి చిత్రం విషయమై.. కొన్నాళ్లుగా శంకర్, కె.ఎస్.రవికుమార్ వంటి కోలీవుడ్ర్ డైరెక్టర్స్ క్యూలో ఉండగా.. వీరందరినీ కాదని... 'అట్టకత్తి', 'మద్రాస్' వంటి చిన్న చిత్రాలతో మెప్పించిన రంజిత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రజనీకాంత్.

తమిళ స్టార్ హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన అగ్రనిర్మాత కలైపులి థాను.. ఈ సినిమా నిర్మించనున్నారు. గతంలో థాను నిర్మించిన 'యార్' చిత్రంలో అతిథిపాత్ర పోషించిన రజనీకాంత్.. మళ్లీ ఇప్పుడు ఈ సంస్థలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు నిర్మాత థాను తెలియజేశారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట.

పెదరాయుడు తర్వాత రజనీకాంత్ నటించనున్న స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే కానుంది. మరి.. లింగా వంటి ఘోర పరాజయం తర్వాత.. రజనీకాంత్ నటిస్తున్న ఈ సినిమా.. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ మెప్పిస్తుందేమో చూడాలి.

English summary
It was back in 2012 that Rajinikanth offered Vidya Balan a movie for the second time. The actress had reportedly first turned down the opportunity to work with the superstar in the movie Rana, but an undeterred Rajini offered her a chance to star in Ranjith latest movie.
Please Wait while comments are loading...