»   »  రజనీకాంత్ 'లింగా' సమస్య మళ్లీ మొదటి?

రజనీకాంత్ 'లింగా' సమస్య మళ్లీ మొదటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: పరిష్కారమైందని భావించిన లింగా చిత్ర సమస్య మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. లింగా చిత్రం డిస్ట్రిబ్యూడటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు నష్టపరిహారంగా రజనీకాంత్ రూ.10 కోట్లు చెల్లించడానికి ముందుకు రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఆ డబ్బును నష్టపోయినవారికి అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ పరిస్థితిలో లింగా చిత్రం చెంగల్‌పట్టు ఏరియా డిస్ట్రిబ్యూటర్ మన్నన్, ఉత్తర, దక్షిణ ఆర్కాడ్ ఏరియా డిస్ట్రిబ్యూటర్ క్రిష్ణమూర్తి, నెల్లై ఏరియా డిస్ట్రిబ్యూటర్ రూపన్ సోమవారంనాడు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు.


చెన్నై

సినిమాకు గాను చెంగల్‌పట్టి ఏరియాకు ఏడున్నర కోట్లు, ఆర్కాడ్ ఏరియాకు నాలుగు కోట్లు, నెల్లై ఏరియాకు రెండున్నర కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని వారు ఆ ఆ ప్రకటనలో అన్నారు. మొదట్లో నష్టపరిహారం చెల్లించాలంటూ గగ్గోలు పెట్టిన బయ్యర్లు ఇప్పుడు కట్ట పంచాయతీ చేస్తున్నారని వారు విమర్శించారు. ఎగ్జిబిటర్లతో చర్చించకుండా తిరువూర్ సుబ్రమణియన్ ఏకపక్ష నిర్ణయాలతో కట్ట పంచాయతీ చేయరాదని వారు సూచించారు.


ఇంతకు ముందు రజనీకాంత్ నటించిన పలు చిత్రాలను పంపిణీ చేసి సుబ్రమణియన్ కోట్ల రూపాయలు లాభాలు సంపాదించారని వారన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు లింగా చిత్ర నష్టాన్ని డిస్టిబ్యూటర్లు భరించాలని అనడం ఏ మాత్రం సమంజసం కాదని వారు అభిప్రాయపడ్డారు. నష్టపరిహారాన్ని సక్రమంగా పంచాలని, లేని పక్షంలో మళ్లీ పోరాటానికి వెనకాడబోమని వారు హెచ్చారు.

Read more about: rajinikanth, linga, tamil nadu
English summary
Tamil super star Rajinikanth's Linga film compensation distribution controversy surfaced.
Please Wait while comments are loading...