»   » ‘బాహుబలి-2’ను దెబ్బ కొట్టేందుకు భారీ ప్లాన్స్, ఏం చేస్తున్నారో తెలుసా?

‘బాహుబలి-2’ను దెబ్బ కొట్టేందుకు భారీ ప్లాన్స్, ఏం చేస్తున్నారో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇకపై ఇండియాలో వచ్చే పెద్ద సినిమాల టార్గెట్ ఏమిటీ అంటే.... బాహుబలి-2 రికార్డులను బద్దలు కొట్టడమే. త్వరలో రాబోతున్న రజనీకాంత్ రోబో '2.0' సినిమా ఇదే లక్ష్యంతో బరిలోకి దిగబోతోంది.

ఇందుకోసం '2.0' టీం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బాహుబలి-2 మూవీని నెం.1 స్థానం నుండి కిందకి తొక్కేయడానికి ఎన్ని దారులున్నాయో అన్ని దారులు వెతుకుతున్నారు.


లాంగ్వేజ్ రికార్డ్

లాంగ్వేజ్ రికార్డ్

‘బాహుబలి-2' తెలుగు, తమిళం, మళయాళం, హిందీ భాషలతో పాటు మరికొన్ని దేశీయ భాషల్లో మాత్రమే విడుదలైంది. అయితే రోబో ‘2.0' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 15 డిఫరెంట్ లాంగ్వేజ్ లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


కనీ వినీ ఎరుగని రిలీజ్

కనీ వినీ ఎరుగని రిలీజ్

బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 వేల థియేటర్లలో రిలీజ్ అయి ఉంటుంది. అయితే రోబో ‘2.0' చిత్రం ప్రపంచ వ్యప్తంగా 70,000 థియేటర్లలో విడుదల చేస్తారని అంటున్నారు. అసలు ప్రపంచంలో అన్ని థియేటర్లు ఉన్నాయో? లేదో? తెలియదు కానీ... ఈ విధంగా ప్రచారం మాత్రం సాగుతోంది.


వచ్చే ఏడాది

వచ్చే ఏడాది

రోబో ‘2.0' చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మనం ఇప్పటి వరకు ఇండియాలో బాహుబలి ప్రభంజనం మాత్రమే చూసాం. అయితే రోబో ‘2.0' అంతకు మించేలా ఉంటుందని, అందుకు తగిన విధంగా మార్కెటింగ్ స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నారని టాక్.


నెల రోజుల తర్వాత కూడా

నెల రోజుల తర్వాత కూడా

విడుదలైన నెల రోజుల తర్వాత కూడా బాహుబలి-2 ప్రదర్శితం అవుతున్న థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరి రోబో ‘2.0' చిత్రం అంతకు మించేలా ఉంటే తప్ప ఆ స్థాయి విజయం సాధ్యం కాదు.


రోబో 2.0

రోబో 2.0

బాహుబలి-2 మూవీ ఇప్పటి వరకు రూ. 1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం హిందీలోనే రూ. 500 కోట్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. రోబో 2.0 చిత్రం ఇంతకు మించిన వసూళ్లు సాధిస్తే తప్ప బాహుబలి-2ను మించిపోయే అవకాశం కనిపించడం లేదు.


English summary
Prabhas' Baahubali 2 crossed the 500 crores mark at the box office in Hindi and successfully touched the 1500 crores mark across all other languages. The film had been released in Telugu, Tamil, Malayalam and Hindi and now Rajinikanth's Robo 2.0 is soon going to break the language record.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu