»   » కృష్ణ హిట్ సినిమా టైటిల్ నే... రజనీ కాంత్ కొత్త చిత్రానికి ?

కృష్ణ హిట్ సినిమా టైటిల్ నే... రజనీ కాంత్ కొత్త చిత్రానికి ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వరస విజయాల శంకర్ దర్శకత్వం వహించిన ఐ చిత్రం రీసెంట్ గా విడుదలై భాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితం పొందలేదు. దాంతో ఆయన ఈ సారి కసిగా ఎలాగైన పెద్ద హిట్ కొట్టాలని నిర్ణయించుకుని రజని తో చిత్రం చేయటానికి రెడీ అయ్యారు. రజనీకాంత్ పరిస్దితి సైతం అలాగే ఉంది. ఆయన నటించిన లింగా చిత్రం డిజాస్టర్ అయ్యింది. దాంతో వీరిద్దరూ కలిసి హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే కథని, టైటిల్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆ టైటిల్ మరేదో కాదు 'నంబర్‌ వన్‌' . ఈ టైటిల్ తో గతంలో తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ, ఎస్పీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం వచ్చి విజయవంతం అయ్యిన సంగతి తెలిసిందే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Rajinikanth-Shankar's Next Movie to be Titled 'Number One'?

'శివాజి', 'రోబో' తర్వాత హ్యాట్రిక్‌ హిట్‌ను సొంతం చేసుకునేందుకు రజనీకాంత్‌, దర్శకుడు శంకర్‌ కృషి చేస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో కొత్త చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని కోలీవుడ్‌లో ఎప్పటినుంచో టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆ విషయం స్పష్టమవుతోంది. 'లింగ' ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో శంకర్‌తో కలసి కొత్త చిత్రంలో నటించాలని రజనీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఇటీవల సైన్స్‌ ఫిక్షన్‌తో కూడుకున్న కథను రజనీకాంత్‌కు వినిపించారని, సినిమాకు తక్కువ సమయం తీసుకుంటుందని శంకర్‌ భరోసా ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. వెంటనే రజనీకాంత్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు కోడంబాకంలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇది 'ఎందిరన్‌'కు సీక్వెల్‌గా ఉంటుందని సమాచారం.

ఈ చిత్రం కోసం 'నంబర్‌ వన్‌' అనే పేరును శంకర్‌ రిజిస్టర్‌ చేశారని కూడా కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఇటీవల లారెన్స్‌ కూడా రజనీకాంత్‌కు కథ చెప్పినట్లు, సూపర్‌స్టార్‌ కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏ చిత్రం ముందు రాబోతోందో వేచి చూడాల్సిందే!

English summary
As per the buzz, the title of Rajinikanth and Shankar combination movie is "Number One", which has been chosen to keep in tune with the fans' excitement when it comes to a Rajinikanth movie. it is said to be a science-fiction but not an official sequel to their earlier blockbuster movie "Enthiran – The Robot".
Please Wait while comments are loading...