For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రజినీకాంత్ సంచలన నిర్ణయం: దీని తర్వాత సినిమాలకు దూరం.. వాళ్ల ఒత్తిడిని తట్టుకోలేకే ఇలా!

  |

  బస్ కండక్టర్ స్థాయి నుంచి ఇండియన్ సినిమాను శాసించే లెవెల్‌కు ఎదిగారు సూపర్ స్టార్ రజినీకాంత్. విలక్షణ నటన, విభిన్నమైన స్టైల్స్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన.. తన క్రేజ్‌ను ఖండాంతరాలు దాటించారు. ఇక, ఆరు పదుల వయసులోనూ కుర్రాళ్లకు పోటీగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన.. రాజకీయాల్లోకి ప్రవేశించే దానిపై యూటర్న్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో రజినీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఆ వివరాలు మీకోసం!

  RajiniKanth : No Political Party Says Super Star | Actor Vijay పొలిటికల్ ఎంట్రీ పై ఒత్తిడి !
  వరుసగా సినిమాలు.. తీరిక లేని షెడ్యూళ్లు

  వరుసగా సినిమాలు.. తీరిక లేని షెడ్యూళ్లు

  దక్షిణాదిలో ఉన్న హీరోలందరితో పోలిస్తే సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంతో సీనియర్ అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆయన ఎంతో వేగంగా సినిమాలను పూర్తి చేస్తుంటారు. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ఎన్నో చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందుకోసం తీరిక లేకుండా షెడ్యూళ్లను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికీ ఆయన అదే వేగాన్ని చూపిస్తూ సత్తా చాటుతున్నారు.

  హైదరాబాద్‌లో అస్వస్థత.. క్షేమంగా ఇంటికి

  హైదరాబాద్‌లో అస్వస్థత.. క్షేమంగా ఇంటికి

  కొద్ది రోజుల క్రితం ఓ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు సూపర్ స్టార్ రజినీకాంత్. అక్కడ ఆయన హైబీపీతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనికి నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్సను తీసుకుని కోలుకున్నారు. 48 గంటల అనంతరం డిశ్చార్చ్ అయిన ఆయన ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు. దీంతో ఫ్యాన్స్‌తో పాటు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

  నేహా మాలిక్ బీచ్ అందాలు.. గోవాలో అందాల ఆరబోత

  పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేసిన రజినీకాంత్

  పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేసిన రజినీకాంత్

  ఎప్పటి నుంచో రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో తన అభిమాన సంఘం ‘రజినీ మక్కల్ మండ్రుం' సభ్యులతో చర్చలు జరిపిన అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారాయన. అంతేకాదు, ‘డిసెంబర్ 31న పార్టీ ప్రకటన.. జనవరి 1 నుంచి ప్రారంభించబోతున్నాం' అని ఓ ట్వీట్ కూడా చేశారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.

  రాజకీయాలపై నిర్ణయాన్ని మార్చుకున్నారు

  రాజకీయాలపై నిర్ణయాన్ని మార్చుకున్నారు

  రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే అస్వస్థతకు గురయ్యారు సూపర్ స్టార్ రజినీకాంత్. కోలుకుని ఇంటికి వెళ్లిన తర్వాత పొలిటికల్ ఎంట్రీపై కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. దీనికి వాళ్లంతా అడ్డు చెప్పడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు మరో ప్రకటనను కూడా వదిలారు. దీనిపై ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతూనే ఉన్నాయి.

  సినిమాల విషయంలో సంచలన నిర్ణయం

  సినిమాల విషయంలో సంచలన నిర్ణయం

  వయసు మీద పడుతున్నప్పటికీ రజినీకాంత్ ఎంతో యాక్టివ్‌గా కనిపిస్తుంటారు. కానీ, ఇటీవలి కాలంలో ఆయన తరచూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మొన్నా మధ్య కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని సూపర్ స్టార్ సంచలన నిర్ణయం తీసుకున్నారని ఓ న్యూస్ హల్‌చల్ చేస్తోంది.

  వాళ్ల ఒత్తిడిని తట్టుకోలేకే ఇలా డిసైడయ్యారు

  వాళ్ల ఒత్తిడిని తట్టుకోలేకే ఇలా డిసైడయ్యారు

  మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తోన్న ‘అన్నత్తే'లో నటిస్తున్నారు రజినీకాంత్. ఈ సినిమా షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసి సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. అనారోగ్యం కారణంగా కుటుంబ సభ్యులు ఒత్తడి చేస్తుండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారట. అంతేకాదు, ఈ షూటింగ్ అనంతరం ఫ్యామిలీతో కలిసి అమెరికా టూర్ వెళ్లబోతున్నారని తెలిసింది. మరి రజినీ పూర్తిగా సినిమాలకు దూరం అవుతారా? లేక తాత్కాలికంగా బ్రేక్ తీసుకుంటున్నారా? అన్నది సస్పెన్స్‌గా మారింది.

  English summary
  Shivaji Rao Gaekwad, known professionally as Rajinikanth, is an Indian actor who works primarily in Tamil cinema. In addition to acting, he has also worked as a producer and screenwriter. He has won many awards, including four Tamil Nadu State Film Best Actor Awards and a Filmfare Best Tamil Actor Award.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X