twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మినిమం పది సినిమాలు గ్యారంటీ.. ఆ సినిమాకి స్టార్ క్యాస్ట్.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఓంకార్!

    |

    ఒక టెలివిజన్ యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించిన ఓంకార్ తర్వాతికాలంలో దర్శకుడిగా కూడా మారారు. 2012లో జీనియస్ సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన ఆ తర్వాత ఒక తమిళ సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. అయితే ఈ రెండు సినిమాలు ఆయనకు పెద్దగా గుర్తింపు మాత్రం తీసుకురాలేక పోయి. కానీ ఎప్పుడు అయితే ఆయన రాజు గారి గది అంటూ 2015లో ఒక సినిమా చేశారో అప్పటితో ఆయన లెక్కలు మారాయి.

    ఇక ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాకు రెండో భాగాన్ని కూడా తెరకెక్కించారు. ఈ రెండో భాగంలో ఏకంగా నాగార్జున కూడా సినిమాలో నటించడంతో పాటు సమంత కూడా కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోక పోయినా కూడా ఇద్దరు స్టార్స్ నటించడంతో మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో తర్వాత దానికి మూడో భాగాన్ని కూడా తెరకెక్కించి రిలీజ్ చేశారు. తన తమ్ముడు హీరోగా అవికాగోర్ హీరోయిన్గా తెరకెక్కిన మూడోభాగం అనుకున్నంత మేర అంచనాలను అందుకోలేక పోయింది.

    Raju Gari Gadhi series will have 10 parts says Ohmkar

    అయినా వెనక్కి తగ్గేద్ది లేదంటున్నారు ఓంకార్. తాజాగా తన తదుపరి సినిమాల గురించి ఆయన ఆసక్తికర కామెంట్లు చేశారు. ఈ రాజు గారి గది సిరీస్ నుంచి పది సినిమాలు ఉంటాయని అని చెప్పుకొచ్చారు. అంతేగాక నాలుగో భాగం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోందని ఆ నాలుగో భాగంలో మాంచి క్రేజ్ ఉన్న నటీనటులు నటిస్తారని వెల్లడించారు. ఇక ప్రస్తుతానికి ఓంకార్ టెలివిజన్లో ప్రసారమవుతున్న సిక్స్త్ సెన్స్ నాలుగో సీజన్ హడావిడిలో ఉన్నారు. దానికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ఈరోజు టెలికాస్ట్ కాబోతోంది. అనసూయ, హైపర్ ఆది, అరియానా గ్లోరీ వంటి వాళ్లు ఈ మొదటి ఎపిసోడ్ లో కనిపిస్తూ ఉండటంతో దాని మీద ఆసక్తి నెలకొని ఉంది.

    English summary
    Raju Gari Gadhi is a franchise made by Ohmkar, in a recent interview he says that there will be at least 10 parts in this series and very soon, he will announce the fourth part.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X