»   » ప్రేమలో మునిగితేలుతున్న రక్త చరిత్ర జంట

ప్రేమలో మునిగితేలుతున్న రక్త చరిత్ర జంట

Posted By:
Subscribe to Filmibeat Telugu

రక్త చరిత్రంలో పరిటాల రవి పాత్ర చేస్తున్న వివేక్ ఒబరాయ్, అతని బార్యగా నటిస్తున్న రాధా ఆప్టే ఇద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారని బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ మేరకు ముంబై ఫిల్మ్ మ్యాగజైన్స్ ప్రత్యేక కథనాలు వెలవరిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు ప్రేమలో పడి లేచిన వివేక్ ఒబరాయ్ కొత్తగా ప్రేమలో పడకపోతే ఆశ్చర్యపడాలి గాని, లవ్ ఎట్ ఫస్ట్ షాట్ అంటే ఆశ్చర్యమేమిటని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక షూటింగ్ పూర్తికాగానే ఇద్దరూ మాయమవుతున్నారని, సెల్ లో కూడా దొరకటం లేదని ప్రొడక్షన్ మేనేజర్స్ గోలపెడుతున్నారు. అలాగే వివేక్ తనకు పరిచయం ఉన్న నిర్మాతలకు ఆమెను ప్రత్యేకంగా పరిచయం చేస్తున్నాడని తెలుస్తోంది. దాంతో రాధిక కూడా వివేక్ కంపెనీని బాగా ఎంజాయ్ చేస్తోందని చెప్తున్నారు. అయితే ఎప్పటిలాగే ఇద్దరూ మీడియా వద్ద కేవలం తాము ప్రెండ్స్ మే నని, సెట్స్ మీద తప్ప మిగతా సమయాల్లో దూరంగా ఉంటామని పాట పాడుతున్నారు. ఇక రక్త చరిత్ర హిట్టయితే ఈ జంటకు క్రేజ్ వచ్చి మరిన్ని ఆఫర్స్ ఆమెకూ వస్తాయి. ఇక వివేక్ ఒబరాయ్ హీరోగా చేసిన ప్రిన్స్ చిత్రం ఏప్రియల్ తొమ్మిదిన రిలీజ్ అవుతోంది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu