»   » గాలి పెళ్లిలో రకుల్, ప్రియమణి డాన్స్? ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో?

గాలి పెళ్లిలో రకుల్, ప్రియమణి డాన్స్? ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు మైనింగ్ సామ్రాజ్యం, జైలు జీవితం లాంటి అంశాలతో వార్తల్లో నిలిచిన గాలి జనార్ధన్ రెడ్డి... ఇటీవల మళ్లీ తన కూతురు వివాహం సందర్బంగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. గాలి కూతురికి ఇటీవలే రాజీవ్‌రెడ్డితో నిశ్చితార్థమైంది.

కూతురు పెళ్లికి వందల కోట్ల ఖర్చు పెడుతున్న గాలి... అందుకు తగిన విధంగానే వెడ్డింగ్ కార్డ్ తయారు చేయించాడు. ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా పెళ్లి పత్రికను ఓపెన్ చేయగానే 'ఆహ్వాన' వీడియో దర్శనమిస్తూ అందరినీ ఆశ్చర్య పరిచింది.

హీరోయిన్లతో డాన్సులు

హీరోయిన్లతో డాన్సులు

ఈ పెళ్లి వేడుకలో తెలుగు స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియమణిలు లైవ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం వారికి కోట్లలో పారితోషికం అందించబోతున్నట్లు చర్చించుకుంటున్నారు.

బాలీవుడ్ నుండి రప్పించాలనుకున్నారు

బాలీవుడ్ నుండి రప్పించాలనుకున్నారు

బాలీవుడ్‌ హీరోయిన్లను కూడా సంప్రదించారని, అయితే గాలి బాగోతం తెలిసిన వారెవరూ అంగీకరించకపోవడంతో రకుల్‌, ప్రియమణిలను సంప్రదించారని, భారీగా రెమ్యూనరేషన్ ఇస్తుండటంతో రకుల్‌, ప్రియమణి ఓకే చెప్పినట్టు టాక్.

భారీ సెట్టింగులు

భారీ సెట్టింగులు

ఈ పెళ్లి కోసం బెంగళూరులోని గాలి ప్యాలెస్‌ను పురాతన కాలం నాటి విజయనగర సామ్రాజ్యాన్ని తలపించేలా సెట్స్ వేస్తున్నారు. ఈ వేడుకకు కన్నడ, తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీల ప్రముఖులను కూడా ఆహ్వానించారు.

సినీ స్టార్ ఎవరు వెలుతున్నారు

సినీ స్టార్ ఎవరు వెలుతున్నారు

ఓ జాతీయ పత్రికలో వచ్చిన న్యూస్ ప్రకారం...టాలీవుడ్ నుండి బ్రహ్మానందం, అలీ హాజరవుతున్నట్టు తెలుస్తోంది.రానా దగ్గుబాటి, రవితేజలు మాత్రం పెళ్లికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారట. మెగా బ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, దర్శకుడు దాసరి నారాయణరావు లాంటి ప్రముఖులను గాలి జనార్ధనరెడ్డి స్వయంగా కలిసి ఆహ్వానాలు అందించారు.

గాలి ప్రేమాభిమానాలకు బానిసను అంటూ..

గాలి ప్రేమాభిమానాలకు బానిసను అంటూ..

‘గాలి జనార్ధన్ రెడ్డి గారి అమ్మాయి వివాహ పత్రిక అందుకోవటం సంతోషకరమైన విషయం. ఆ కుటుంబం నా పైన చూపించే ప్రేమాభిమానాలకు నేనెప్పుడూ బానిసను' అంటూ ఆహ్వాన పత్రిక అందుకుంటున్న ఫొటోను సంపూ తన సోషల్ మీడియాలో సోమవారం రాత్రి పోస్ట్ చేశాడు.

ఎందుకు డిలీట్ చేసాడు?

ఎందుకు డిలీట్ చేసాడు?

అయితే మంగళవారం ఉదయం సంపూ ఆ పోస్ట్‌ను డిలీట్ చేశాడు. అయితే సంపూర్ణేష్ బాబు ఆ పోస్టును ఎందుకు డిలీట్ చేసాడు? రాత్రికి రాత్రి ఏం జరిగింది? అనేది హాట్ టాపిక్ అయింది.

rn

గాలి కూతురు వెడ్డింగ్ కార్డ్ వీడియో

గాలి కూతురు వెడ్డింగ్ కార్డ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

rn

ఇదే తొలిసారి

ఈ వీడియోలో జనార్ధన్ రెడ్డి, ఆయన సతీమణి లక్ష్మితోపాటు కుమారుడు, కూతురు బ్రాహ్మణి, కాబోయే అల్లుడు రాజీవ్ రెడ్డి కనిపిస్తారు. నవంబర్ 16న జరిగే బ్రాహ్మణి, రాజీవ్‌ల వివాహానికి హాజరు కావాలంటూ ఆ పాటలో ఉంటుంది. శివలింగానికి పూజ చేస్తూ గాలి దంపతులుండగా, మిగితా వారు కూడా వారిద్దకు చేరుకుంటారు.

English summary
Film Nagar source said that, Rakul Preet, Priyamani dance for Gali Janardhana Reddy daughter wedding.
Please Wait while comments are loading...