For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిజమా? :రకుల్ ప్రీతి సింగ్ ఒక్కసారిగా పెంచేసింది

  By Srikanya
  |

  హైదరాబాద్: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత హీరోయిన్స్ కు అర్దమయినట్లుగా మరొకరికి అర్దం కాదేమో. గ్లామర్, డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే స్కీమ్ తో వారు ముందుకు వెల్తూంటారు. అందుకు రకుల్ ప్రీతి సింగ్ అతీతురాలేమీ కాదు. ఆమె కూడా అదే రూటులో ప్రయాణం పెట్టుకుంది. అయితే ఆమె రెమ్యునేషన్ పెంచటం చాలా మంది దర్శక,నిర్మాతలు జీర్ణించుకోలేక షాక్ అవుతున్నట్లు చెప్పుకుంటున్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఓవర్ నైట్ లో తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకున్న రకుల్ ప్రీతి సింగ్ తన రెమ్యునేషన్ ని ఒక్కసారిగా పెంచేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. లౌక్యం, కరెంట్ తీగ చిత్రాలతో మరింత పాపులారిటీ సంపాదించుకున్న ఆమె ఇప్పుడు 50 లక్షలు డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. ఇంతకుముందు ఆమె సినిమాకు 25 లక్షలు తీసుకునేదని తెలుస్తోంది.

  Rakul Preet Singh Increased The Fee

  వెంకటాద్రి ఎక్సప్రెస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఇప్పుడు రామ్ సరసన పండుగ చేస్కో, రవితేజ సరసన కిక్ 2 చిత్రాలు చేస్తోంది. ఈ రెండు భారీ బడ్జెట్ చిత్రాలు కావటం విశేషం. అలాగే ఈమె ఇప్పుడు సుకుమార్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం సైన్ చేసిందని తెలుస్తోంది. దాంతో ఆమెకు పెద్ద హీరోలు నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. దానికి తగినట్లే ఆమె రెమ్యునేషన్ ని పెంచేసుకుంటూ వెళ్తోంది.

  ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హైదరాబాద్‌ టు ముంబై, ముంబై టు సిమ్లా, సిమ్లా టు హైదరాబాద్‌ ఇలా బిజీగా తిరుగుతుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఇచ్చిన కిక్‌తో ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. అరడజను సినిమాలతో తిరిక లేకుండా గడుపుతోంది. మరోవైపు హిందీ సినిమా హడావుడిలో ఉంది. అందుకోసం హైదరాబాద్‌ నుంచి ముంబై, ముంబై నుంచి హైదరాబాద్‌ పదే పదే తిరిగాల్సి వస్తోంది. మధ్యలో సిమ్లాలో హిందీ సినిమా చిత్రీకరణలో పాల్గొంటుంది. దీంతో రకుల్‌ ఇప్పుడు యమ బిజీ బ్యూటీ అయిపోయింది.

  ''రోజూ చిత్రీకరణ ముగిసి ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు నేనే ఓ ప్రశ్న వేసుకొంటున్నా. ''ఈ రోజు ఇక్కడ నేనేం నేర్చుకొన్నా..' అని. ప్రతిసారి సంతృప్తికరమైన సమాధానం దొరుకుతోంది. అందుకే మరుసటి రోజు మరింత ఉత్సాహంగా సెట్‌లోకి అడుగుపెడుతున్నా..'' అంటోంది రకుల్‌ ప్రీత్‌సింగ్‌.

  ''స్కూల్‌కి ఎంత హుషారుగా వెళ్లేదాన్నో... సెట్స్‌కీ అలానే వెళ్తున్నా. చుట్టూ నా మనుషులే ఉన్నట్లుంది. రోజూ చిత్రీకరణ ఉంటే బాగుంటుందనిపిస్తోంది. నేను సినిమాలకు కొత్త. అందుకే ప్రతిదీ నాకు వింతగా అనిపిస్తోంది. ఇవన్నీ ఎంత త్వరగా నేర్చుకుంటానా అనే ఆత్రుత ఉంది. ప్రస్తుతానికి నేర్చుకొనే దశలో ఉన్నాను. ఒకట్రెండు తప్పులు చేసినా సెట్లో దర్శకులు పెద్ద మనసుతో క్షమించేస్తున్నారు'' అని చెబుతోంది రకుల్‌.

  ‘కిక్'-2 విషయానికి వస్తే...

  వరస విజయాలతో దూసుకుపోతున్న భామ రకుల్ ప్రీతి సింగ్. ఆమె ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న ‘కిక్'-2 లో హీరోయిన్ గా చేస్తోంది. అందులో తాను పల్లెటూరి అమ్మాయిగానూ, సిటీ గర్ల్ గానూ కనిపింస్తానని రీసెంట్ గా ట్వీట్ చేసింది. దాంతో ఆమె ద్విపాత్రాభినయం చేస్తోందంటూ మీడియాలో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆమె దాన్ని ఖండిస్తూ మళ్లీ ట్వీట్ చేసింది.

  రకుల్ ట్వీట్ చేస్తూ... 'నేను కిక్ 2 లో పల్లె, సిటీ అమ్మాయిగా చేస్తున్న మాట నిజమే. అయితే నేను రెండు అవతరాల్లో కనిపిస్తాను అని చెప్తున్నాను కానీ, ద్వి పాత్రాభినయం చేయటం లేదు.మీరు థియోటర్ లో ఆ పాత్రను చూసినప్పుడు ఆశ్చర్యపోతారు ', అంటూ ట్విస్ట్ తో కూడిన ట్వీట్ చేసింది. ఇదంతా చిత్రం ప్రచారం కోసమే అంటున్నారు సినీ వాసులు.

  రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్' చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇపుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా రవితేజ హీరోగా నటించే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ‘కిక్-2' చిత్రానికి దర్శకత్వం సురేందర్ రెడ్డి. ఈ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమై రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.

  ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమని రవితేజ అన్నారు. 'కిక్'లో జంటగా నటించిన రవితేజ, ఇలియానా పాత్రల కొడుకు కథే ఈ 'కిక్ 2' అని దర్శకుడు తెలిపారు.

  నిర్మాత మాట్లాడుతూ...యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజ మార్క్ ఎంటర్‌టైనర్‌తోపాటు సురేందర్ రెడ్డి, తమన్నా మ్యాజిక్ మళ్లీ రిపీట్ కానుంది. ఈ చిత్రం మే 28, 2015న విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి కథ:వక్కంతం వంశి, కెమెరా:మనోజ్ పరమహంస, సంగీతం:తమన్, నిర్మాత:నందమూరి కళ్యాణ్‌రామ్, దర్శకత్వం:సురేందర్ రెడ్డి.

  English summary
  As per the latest updates, currently Rakul Preet Singh is demanding 50 lakhs for her forth coming movies.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X