»   » కేవలం 20 నిమిషాలే.. కోటి రూపాయలు కొట్టేసిన రకుల్

కేవలం 20 నిమిషాలే.. కోటి రూపాయలు కొట్టేసిన రకుల్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  టాలీవుడ్‌లో ఎన్టీఆర్ బయోపిక్‌ను ప్రతిష్టాత్మకంగా తీర్చి దిద్దుతున్నారు. తొలుత ఒకే పార్ట్‌గా తీయాలని అనుకొన్నప్పటికీ.. కథలో ఉండే ప్రాధాన్యాన్ని బట్టి సినిమాను రెండు భాగాలుగా విభజించారు. సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసేందుకు శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అవుట్‌పుట్‌ను చూసి చిత్ర యూనిట్ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో భారీ సంఖ్యలో ప్రముఖ నటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన రకుల్ ప్రీత్ సింగ్ రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

  NTR Biopic : Balakrishna & Rakul Preet Pic Goes Viral

  తడి అందాలతో రకుల్.. 'ఆకుచాటు పిందె తడిసె' అంటూ బాలయ్య చిందులు!

   శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్

  శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్

  ఎన్టీఆర్ బయోపిక్‌లో రకుల్ ప్రీత్ సింగ్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. అలనాటి అందాల తార శ్రీదేవి పాత్రలో కనువిందు చేయనున్నారు. ఎన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించిన ఎపిసోడ్‌లో రకుల్ పాత్ర కీలకంగా డిజైన్ చేశారట. అంతేకాకుండా ఇతర పాత్రలతో పోలిస్తే చాలా గ్లామరస్‌గా రూపొందించినట్టు తెలిసింది.

   20 నిమిషాల కోసం 1 కోటి

  20 నిమిషాల కోసం 1 కోటి

  ఎన్టీఆర్ బయోపిక్‌లో రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర నిడివి 20 నిమిషాలుగా ఉంటుందనేది టాక్. అయితే ఈ పాత్రను పోషించడానికి రకుల్ స్వయంగా ముందుకొచ్చింది. అయితే నిర్మాతలు రకుల్‌కు భారీగానే ముట్టజెప్పారట. సుమారుగా ఈ చిత్రానికి రూ.1 కోటి రూపాయలు తీసుకొన్నట్టు సమాచారం.

  త్వరలో బొబ్బిలిపులి సీన్లు

  త్వరలో బొబ్బిలిపులి సీన్లు

  ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు సంబంధించి వేటగాడు చిత్రంలోని ఆకుచాటు పిందే తడిసే పాటను ఇటీవల బాలకృష్ణ, రకుల్‌పై చిత్రీకరించారు. దానికి సంబంధించిన ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. త్వరలోనే బొబ్బిలిపులి సినిమాకు చెందిన సీన్లను త్వరలో తెరకెక్కించనున్నట్టు తెలిసింది.

  కీలక పాత్రల్లో రానా, విద్యాబాలన్

  కీలక పాత్రల్లో రానా, విద్యాబాలన్

  మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన సతీమణి బసవతారకంగా విద్యాబాలన్ కనిపించనున్నారు. చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, మరికొన్ని కీలక పాత్రల కోసం రాశీ ఖన్నా, పృథ్వీరాజ్ తదితరులను తీసుకొన్నట్టు తెలిసింది.

  English summary
  N.T.R is being produced by Nandamuri Balakrishna, Vishnu Induri and Sai Korrapati jointly. The biopic will hit the screens in January 2019. Nithya Menen has been signed on to play Savitri in N.T.R and an official announcement would be made soon by the makers. If these reports are to be believed, the makers were quite keen on signing on Nithya for a long time now and she was the first choice for the role. Reports suggest that Rakul will have a 20-minute role in the two-part Telugu biopic and will reportedly get paid Rs 1 crore to play Sridevi on screen.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more