»   »  సంవత్సర టైమ్...కోటిన్నర రెమ్యునేషన్

సంవత్సర టైమ్...కోటిన్నర రెమ్యునేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవటం...హిట్ ఉన్నప్పుడే రెమ్యునేషన్ పెంచేయటం కామన్. అందంతో, తన నటనతో యూత్ లో క్రేజ్ పెంచుకుంటున్న బ్యూటీ రకుల్ ప్రీతిసింగ్ .నాన్నకు ప్రేమతో, సరైనోడు సినిమాలతో జోరుమీదున్న హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. వరసగా పెద్ద సినిమాలు చేస్తున్న ఈ అమ్మడుకు క్రేజ్ మరింత పెరిగింది. ఎంతలా అంటే రెమ్యునేషన్ గా సుమారు కోటిన్నర అడుగుతోందట. అయితే అది సినిమాకు మాత్రం కాదట.

పూర్తి వివరాల్లోకి వెళితే.... విశాఖపట్టణంలోని వైభవ్ జ్యూవలర్ ప్రకటనకు సంబందించి చేయ్యాడానికి కోటిన్నర అడుగుతోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఈ ప్రకటనకోసం పోస్టర్స్ మరియు ప్రమోనల్ వీడియోలు కి పనిచేయాల్సి ఉంటుంది. ఈ యాడ్ ఎగ్రిమెంట్.., కేవలం ఒక సంవత్సరన్నర వరకు మాత్రమే. అంత తక్కువ సమయానికే అంత డిమాండ్ చేయటమేంటని కొందరు ఆశ్చర్యపోతున్నారు.

 Rakul Preet Singh signed Vaibhav Jewellers

రేటును మాత్రం పెంచలేదు....

మరో ప్రక్క కొద్ది రోజుల క్రితం ఈ హీరోయిన్ ..రెమ్యునేషన్ విషయం మీడియాలో హైలెట్ అయ్యింది. అయితే తాను రెమ్యునేషన్ పెంచలేదని అంది. మంచి ఆఫర్ వస్తే...రెమ్యూనరేషన్‌ను పట్టించుకోవడం లేదని అంటోంది. కెరీర్ విషయంలో రకుల్ ఆచితూచి అడుగులేస్తున్నారని తెలుస్తోంది.

పెద్ద హీరోలతో నటించడానికి అవకాశం వస్తే ఏ నటి అయినా రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేస్తారు.. కానీ రకుల్ మాత్రం పెంచలేదట. ఎవరికీ క్లాష్ కాకుండా డేట్స్‌ను సర్దుకుని వారితో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు రకుల్. ఇప్పటి వరకు రకుల్ రూ. 30 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద హీరోలతో నటించే అవకాశం వచ్చినప్పటికీ రూ. 30 లక్షల పైన డిమాండ్ చేయడం లేదని అంటున్నారు.

English summary
Rakul Preet Singh has been signed by Visakhapatnam based Vaibhav Jewellers for a whopping Rs 1.5 crore!
Please Wait while comments are loading...