»   » రకుల్ ప్రీతి రేటే టెంప్ట్ చేస్తోంది...అందుకే అంత బిజీ

రకుల్ ప్రీతి రేటే టెంప్ట్ చేస్తోంది...అందుకే అంత బిజీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత హీరోయిన్స్ కు అర్దమయినట్లుగా మరొకరికి అర్దం కాదేమో. గ్లామర్, డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే స్కీమ్ తో వారు ముందుకు వెల్తూంటారు. అందుకు రివిర్స్ లో రకుల్ ప్రీతి సింగ్ వెళ్తోందంటున్నారు. ముందు కెరీర్ లో పూర్తి స్దాయిలో సెటిల్ అయితే డబ్బు దానంతట అదే వచ్చిపడుతుందనే సిద్దాంతాన్ని నమ్మి...రెమ్యునేషన్ ని మాత్రం పెంచకుండా అలాగే ఉంచేసిందంటన్నారు. అందుకే ఆమె వరస ఆఫర్స్ తో బిజీగా ఉంటోందని చెప్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఆమె లౌక్యం హిట్ అయ్యిన తర్వాత తన రెమ్యునేషన్ ని అమాంతం పెంచేస్తుందని భావించారు. అయితే చాలా మినిమం అంటే 30 లక్షలు మాత్రమే సినిమాకు తీసుకుని పనిచేస్తోంది. అంతేకాకుండా బల్క్ డేట్స్ ఇవ్వటానికి,నిరంతంరం అందుబాటులో ఉండటానికి ప్రయత్నిస్తోందని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా నాకు అది కావాలి...ఇలాంటి హోటల్ లో ఉంచాలి వంటి కాస్ట్లీ డిమాండ్స్ మాత్రం పెట్టకుండా నిర్మాతను ఆనందపరవటమే ఆమె సక్సెస్ సూత్రం అని చెప్తున్నారు.

ప్రస్తుతం రకుల్ అటు రామ్ చరణ్ సినిమాలోనూ బుక్కైంది. అలాగే మహేష్ కొత్త చిత్రంలోనూ ఆమెనే తీసుకునే అవకాసం ఉందని చెప్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు అయ్యేసరికి ఆమె తెలుగులో పెద్ద స్టార్ హీరోయిన్ గ తేలుతుందంటున్నారు. దానికి తోడు ఆమె చేసిన సినిమాలు హిట్ అవుతూండటంతో లక్కీ హీరోయిన్ ముద్ర సైతం పడింది. దర్శక,నిర్మాతలే కాకుండా హీరోలు సైతం ఆమెనే కోరుకుంటూ ఆమెను బిజీ చేస్తున్నారు.

ఓవర్ నైట్ లో తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకున్న రకుల్ ప్రీతి సింగ్ తన రెమ్యునేషన్ ని ఒక్కసారిగా పెంచేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. లౌక్యం, కరెంట్ తీగ చిత్రాలతో మరింత పాపులారిటీ సంపాదించుకున్న ఆమె డిమాండ్ మాత్రం చేయటం లేదని చెప్పుకుంటున్నారు. ఇంతకుముందు ఆమె సినిమాకు 25 లక్షలు తీసుకునేదని తెలుస్తోంది. ఇప్పుడు ఐదు పెంచి ముప్పైలో సెటిల్ అయ్యిందంటున్నారు.

వెంకటాద్రి ఎక్సప్రెస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఇప్పుడు రామ్ సరసన పండుగ చేస్కో, రవితేజ సరసన కిక్ 2 చిత్రాలు చేస్తోంది. ఈ రెండు భారీ బడ్జెట్ చిత్రాలు కావటం విశేషం. అలాగే ఈమె ఇప్పుడు సుకుమార్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం సైన్ చేసిందని తెలుస్తోంది. దాంతో ఆమెకు పెద్ద హీరోలు నుంచి ఆఫర్స్ వస్తున్నాయి.

Rakul Preeth Singh at Best Price!

ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హైదరాబాద్‌ టు ముంబై, ముంబై టు సిమ్లా, సిమ్లా టు హైదరాబాద్‌ ఇలా బిజీగా తిరుగుతుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఇచ్చిన కిక్‌తో ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. అరడజను సినిమాలతో తిరిక లేకుండా గడుపుతోంది. మరోవైపు హిందీ సినిమా హడావుడిలో ఉంది. అందుకోసం హైదరాబాద్‌ నుంచి ముంబై, ముంబై నుంచి హైదరాబాద్‌ పదే పదే తిరిగాల్సి వస్తోంది. మధ్యలో సిమ్లాలో హిందీ సినిమా చిత్రీకరణలో పాల్గొంటుంది. దీంతో రకుల్‌ ఇప్పుడు యమ బిజీ బ్యూటీ అయిపోయింది.

''రోజూ చిత్రీకరణ ముగిసి ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు నేనే ఓ ప్రశ్న వేసుకొంటున్నా. ''ఈ రోజు ఇక్కడ నేనేం నేర్చుకొన్నా..' అని. ప్రతిసారి సంతృప్తికరమైన సమాధానం దొరుకుతోంది. అందుకే మరుసటి రోజు మరింత ఉత్సాహంగా సెట్‌లోకి అడుగుపెడుతున్నా..'' అంటోంది రకుల్‌ ప్రీత్‌సింగ్‌.

''స్కూల్‌కి ఎంత హుషారుగా వెళ్లేదాన్నో... సెట్స్‌కీ అలానే వెళ్తున్నా. చుట్టూ నా మనుషులే ఉన్నట్లుంది. రోజూ చిత్రీకరణ ఉంటే బాగుంటుందనిపిస్తోంది. నేను సినిమాలకు కొత్త. అందుకే ప్రతిదీ నాకు వింతగా అనిపిస్తోంది. ఇవన్నీ ఎంత త్వరగా నేర్చుకుంటానా అనే ఆత్రుత ఉంది. ప్రస్తుతానికి నేర్చుకొనే దశలో ఉన్నాను. ఒకట్రెండు తప్పులు చేసినా సెట్లో దర్శకులు పెద్ద మనసుతో క్షమించేస్తున్నారు'' అని చెబుతోంది రకుల్‌.

‘కిక్'-2 విషయానికి వస్తే...

వరస విజయాలతో దూసుకుపోతున్న భామ రకుల్ ప్రీతి సింగ్. ఆమె ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న ‘కిక్'-2 లో హీరోయిన్ గా చేస్తోంది. అందులో తాను పల్లెటూరి అమ్మాయిగానూ, సిటీ గర్ల్ గానూ కనిపింస్తానని రీసెంట్ గా ట్వీట్ చేసింది. దాంతో ఆమె ద్విపాత్రాభినయం చేస్తోందంటూ మీడియాలో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆమె దాన్ని ఖండిస్తూ మళ్లీ ట్వీట్ చేసింది.

రకుల్ ట్వీట్ చేస్తూ... 'నేను కిక్ 2 లో పల్లె, సిటీ అమ్మాయిగా చేస్తున్న మాట నిజమే. అయితే నేను రెండు అవతరాల్లో కనిపిస్తాను అని చెప్తున్నాను కానీ, ద్వి పాత్రాభినయం చేయటం లేదు.మీరు థియోటర్ లో ఆ పాత్రను చూసినప్పుడు ఆశ్చర్యపోతారు ', అంటూ ట్విస్ట్ తో కూడిన ట్వీట్ చేసింది. ఇదంతా చిత్రం ప్రచారం కోసమే అంటున్నారు సినీ వాసులు.

రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్' చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇపుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా రవితేజ హీరోగా నటించే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ‘కిక్-2' చిత్రానికి దర్శకత్వం సురేందర్ రెడ్డి. ఈ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమై రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.

ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమని రవితేజ అన్నారు. 'కిక్'లో జంటగా నటించిన రవితేజ, ఇలియానా పాత్రల కొడుకు కథే ఈ 'కిక్ 2' అని దర్శకుడు తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ...యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజ మార్క్ ఎంటర్‌టైనర్‌తోపాటు సురేందర్ రెడ్డి, తమన్నా మ్యాజిక్ మళ్లీ రిపీట్ కానుంది. ఈ చిత్రం మే 28, 2015న విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి కథ:వక్కంతం వంశి, కెమెరా:మనోజ్ పరమహంస, సంగీతం:తమన్, నిర్మాత:నందమూరి కళ్యాణ్‌రామ్, దర్శకత్వం:సురేందర్ రెడ్డి.

English summary
Rakul hasn't upped her price tag yet despite the demand say buzz from Tollywood.
Please Wait while comments are loading...