»   » తల్లి తండ్రులతో రకుల్‌ ప్రీత్‌ (ఫొటో)

తల్లి తండ్రులతో రకుల్‌ ప్రీత్‌ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా వారితో కలిసి తీసుకున్న ఓ ఫొటోని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. వారి బంధాన్ని చూస్తే.. వివాహ బంధం ఎంత మధురమైనదో అనిపిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. వారి బంధం ఇలాగే కలకాలం ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

కెరీర్ విషయానికి వస్తే.. రకుల్ ప్రీతి సింగ్ తెలుగు సొంతంగా నేర్చేసుకుని సొంతగొంతుకతో డబ్బింగ్‌లు చెప్పేందుకు ఆరాటపడుతోంది. ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో' కోసం ఆమె స్వయంగా గొంతు వినిపించబోతోంది. డిసెంబర్ లో ఈ మూవీ డబ్బింగ్ వర్క్ మొదలు కానుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

డబ్బింగ్ ప్రారంభం అయ్యాక కొన్ని సీన్స్ కి రకుల్ ప్రీత్ చేత డబ్బింగ్ చెప్పించి పూర్తిగా ఆమె గొంతు సెట్ అవుతుంటే తనతోనే డబ్బింగ్ చెప్పించాలని ఫిక్స్ అయ్యాడు సుకుమార్. త్వరలోనే ఈ చిత్ర టీం ఫైనల్ షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్లనున్నారు.

Rakul with her parents and marriage

దర్శకుడు సుకుమార్‌ మాట్లాడుతూ ''గెటప్‌లోనూ, క్యారెక్టరైజేషన్‌లోనూ, కథలోనూ, స్క్రీన్‌ప్లేలోనూ అన్ని విధాలా కొత్తగా ఉండే ఈ 'నాన్నకు ప్రేమతో..'లో ఓ కొత్త ఎన్టీఆర్‌ని చూస్తారు. ఎన్టీఆర్‌ ఇమేజ్‌కి తగినట్టుగా అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటూనే సినిమా కొత్త స్టైల్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎన్టీఆర్‌తో ఫస్ట్‌ టైమ్‌ చేస్తున్న 'నాన్నకు ప్రేమతో..' నా కెరీర్‌లోనూ, ఎన్టీఆర్‌ కెరీర్‌లోనూ చాలా మంచి సినిమా అవుతుంది'' అన్నారు.

నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ '' లండన్‌లో తొలి షెడ్యూల్‌ చేసాం. ఈ షెడ్యూల్‌లోనే పీటర్‌ హెయిన్స్‌ సారధ్యంలో మూడు థ్రిల్లింగ్‌ ఫైట్స్‌, రాజు సుందరం, శేఖర్‌ మాస్టర్‌ల సారధ్యంలో రెండు పాటలు, వాటితో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొన్న ఇంపార్టెంట్‌ సీన్స్‌ చిత్రీరించాం. జనవరి 8న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని అన్నారు.

ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ : విజరు చక్రవర్తి, ఆర్ట్‌ : రవీందర్‌, ఫైట్స్‌ : పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌ : నవీన్‌ నూలి, పాటలు : చంద్రబోస్‌, డాన్స్‌ : రాజు సుందర కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : సుకుమార్‌.

English summary
Rakul Preet Singh tweeted: "Happpy Anniv to d best parents in d world!U make marriage look so beautiful!May Ur bond be as strong forever n Eva!"
Please Wait while comments are loading...