»   » మరోసారి రామ్ చరణ్,అల్లు అర్జున్ కాంబినేషన్

మరోసారి రామ్ చరణ్,అల్లు అర్జున్ కాంబినేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ram Charan,Allu arjun multi starrer soon?
హైదరాబాద్: 'ఎవడు' చిత్రంలో అదరకొట్టిన అల్లు అర్జున్, రామ్ చరణ్ మరోసారి తెరపై కలిసి కనిపించి అలరించనున్నారని తెలుగు సినీ వర్గాల సమాచారం. ఈ మేరకు ఓ తెలుగు భారీ నిర్మాత ప్రయత్నాలు మొదలెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం బాలీవుడ్ లో రీసెంట్ గా విడుదలై హిట్టైన గుండే చిత్రం రైట్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ చిత్రాన్ని వీరిద్దరితో రీమేక్ చేస్తే మంచి హిట్ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం టాక్స్ జరుగుతున్నాయి. అన్ని ఓకే అనుకుంటే త్వరలోనే ప్రకటన వచ్చే అవకాసం ఉంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'రేసు గుర్రం'. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా ఇదే. టైటిల్ కు తగ్గట్లు రేసు గుర్రంలాగానే ఈ చిత్రం విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. విడుదల తేదీ ని ఏప్రియల్ 4 వ తేదీకి మార్చారని తెలుస్తోంది. పూర్తై ఫస్ట్ కాపీ పట్టటానికి ఇంకా రెండు నెలలు సమయం పట్టేటట్లు ఉందని అందుకే విడుదల ను ముందుకు నెట్టారని చెప్తున్నారు. చిత్రంలో అల్లు అర్జున్ క్యారక్టరైజేషన్ చాలా విభిన్నంగా ఉండబోతోందని దర్శకుడు చెప్తున్నాడు. ఫన్,యాక్షన్ కలిపి మరో కిక్ లా రూపొందిస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.


సురేంద్రరెడ్డి మాట్లాడుతూ... "పరుగు పందెంలో గెలవడం రేసుగుర్రం విధి. జీవితమనే పరుగు పందెంలో గెలవడం మనిషి విధి. అయితే... ఈ రేసులో అడపాదడపా గెలిచేవారు కొందరైతే... గెలుపుని ఇంటిపేరుగా మార్చుకున్నవాళ్లు కొందరు. ఆ కొందరిలో ఒకడి కథే... 'రేసుగుర్రం. బాధ్యతాయుతమైన ఓ యువకుని కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు" అన్నారు.

మరో ప్రక్క రామ్‌చరణ్‌ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాజల్‌ హీరోయిన్. శ్రీకాంత్‌, కమలిని ముఖర్జీ ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. బండ్ల గణేష్‌ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామేశ్వరంలో జరుగుతోంది. చిత్ర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. సినిమాలో ఈ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయంటున్నారు.

నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ- ''కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు, తెలుగు సంప్రదాయాలు కలగలిపి తీర్చిదిద్దుకున్న కథ ఇది. సినిమాలో రామ్‌చరణ్‌ కొత్తగా కనిపిస్తాడు. శ్రీకాంత్‌ ఇందులో రామ్‌చరణ్‌కి యంగ్‌ బాబాయిగా కనిపిస్తారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. తమిళ నటుడు రాజ్‌కిరణ్‌ పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాగర్‌కోయిల్‌, పొల్లాచ్చిలోనూ త్వరలో చిత్రీకరణ జరుపుతాము''అన్నారు.

English summary
Ram Charan and Allu Arjun are getting ready to star in a full length entertainer. Buzz is plans are on to re-make a Bollywood film ‘Gundey’ with these two stars. Talks are on to bag the re-make rights of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu