»   »  బోయపాటి కి హ్యాండ్ ఇచ్చాడు

బోయపాటి కి హ్యాండ్ ఇచ్చాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బోయపాటి శ్రీను, రామ్ చరణ్ కాంబినేషన్ తో వెంటనే ఓ చిత్రం ప్రారంభం కానుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు దర్శకుడు బోయపాటి మీడియాకు పదే పదే చెప్పారు కూడా. అంతేకాకుండా భధ్ర తరహా లవ్ స్టోరీతో కూడిన యాక్షన్ చిత్రం అని మరీ చెప్పాడు. అందరూ గోవిందుడు అందరు వాడేలే తర్వాత ఈ చిత్రమే అనుకున్నారు. అయితే ఊహించని విధంగా సీన్ లోకి శ్రీను వైట్ల వచ్చారు. ఈ విషయమై మీడియాకు ప్రెస్ నోట్ కూడా ఇచ్చేసారు. ఆగడు తర్వాత చేయబోయే చిత్రం తనతోనే అని రామ్ చరణ్ చెప్పేసారు. ఎక్కడా బోయపాటి తో చిత్రం గురించి ప్రస్తావించలేదు. పోనీ శ్రీను వైట్ల చిత్రం తర్వాత చేస్తాడనుకున్నా చాలా టైం పడుతుంది. అంతకాలం లెజండ్ హిట్ లో ఉన్న బోయపాటి ఆగడు అంటున్నారు.

శ్రీనువైట్ల దర్శకత్వంలో...: 'గోవిందుడు..' తరవాత రామ్‌చరణ్‌ చేయబోయే సినిమా కూడా ఖరారైంది. ఆయన శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా వూపారు. ఈ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తారు. సెప్టెంబరులో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం 'ఆగడు' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు శ్రీనువైట్ల.

Ram Charan, Boyapati film not confirmed

రాంచరణ్, కాజల్ జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం తదుపరి షెడ్యూల్ జూన్ 5 నుంచి జరుగుతుంది. షెడ్యూల్ వివరాలను నిర్మాత బండ్ల గణేశ్ వివరిస్తూ 'ఈ షెడ్యూల్‌లో ఫ్యామిలీ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తాం. ఆ తరువాత లండన్‌కి యూనిట్ వెళుతుంది. ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, జయసుధ జంటగా నటిస్తున్నారు. ముఖ్యంగా రాంచరణ్, శ్రీకాంత్, ప్రకాశ్‌రాజ్‌పై చిత్రీకరించే ప్రతి సన్నివేశం ఆద్యంతం నవ్విస్తుంది.

కుటుంబకథాచిత్రాలను రూపొందించడంతో దిట్ట మా దర్శకుడు కృష్ణవంశీ. తెలుగు సంప్రదాయలకు అద్దంపట్టేలా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారు. ఈ సమ్మర్‌లో షూటింగ్‌కి కొంత విరామం ఇచ్చాం. ఈ గ్యాప్‌లో యువన్‌శంకరరాజా సంగీత సారథ్యంలో మూడు పాటలు రికార్డ్ చేశాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి విజయదశమికి సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం' అని తెలిపారు.

English summary
Srinu Vaitla is likely to direct Ram Charan in his next project. Currently, Srinu Vaitla is busy readying the script for this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu