»   » తల్లికోసం రామ్ చరణ్ నిర్మాతగా...

తల్లికోసం రామ్ చరణ్ నిర్మాతగా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ తేజ త్వరలో నిర్మాతగా మారి తనే హీరోగా ఓ చిత్రం చేయనున్నారని సమాచారం. అయితే ఆ చిత్రం చేస్తే వచ్చే రెవిన్యూ మొత్తం తల్లికి ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ డెషిసన్ తీసుకున్నాడని తెలుస్తోంది. అలాగే ఈ బ్యానర్ కి పెట్టుబడిగా తన మూడు చిత్రాల రెమ్యునేషన్ ని ఇన్వెస్ట్ చేయనున్నాడు. చిరంజీవి తన తల్లి పేర అంజనా ప్రొడక్షన్స్ స్ధాపించినట్లే తాను కూడా తల్లి పేరుతో ఈ బ్యానర్ పెట్టాలనుకుంటున్నాడని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం కోసం రచయిత చిన్నికృష్ణకు మంచి కథ తయారు చేయమని అడ్వాన్స్ కూడా ఇచ్చాడని వినపడుతోంది. చిన్ని కృష్ణ ప్రస్తుతం అల్లు అర్జున్, వివి వినాయిక్ ల కాంబినేషన్లో చేస్తున్న బద్రీనాధ్ చిత్రానికి కథ ఇచ్చారు. అలాగే రామ్ చరణ్, భాస్కర్ ల తాజా చిత్రం ఆరెంజ్...ఓ రేంజి లవ్ స్టోరీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుపుకుంటోంది. జెనీలియా..రామ్ చరణ్ కి హీరోయిన్ గా చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu