»   » రామ్ చరణ్ 'మెరుపు'లో క్యారెక్టర్ ఏమిటంటే...

రామ్ చరణ్ 'మెరుపు'లో క్యారెక్టర్ ఏమిటంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్, తమిళ దర్శకుడు ధరణి కాంబినేషన్లో రూపొందుతున్న మెరుపు చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్...ఫుట్ బాల్ ప్లేయర్ పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు చిరంజీవి విజేత చిత్రంలో ఫుట్ బాల్ ప్లేయర్ పాత్రను పోషించారు. తండ్రి బాటలోనే నడుస్తూ విజయాలు సాధిద్దామని రామ్ చరణ్ తలపోస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో అంటున్నారు. ఇక ఇంతకుముందు ధరణి..పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో బంగారం అనే చిత్రం విడుదలైంది. త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి డిసెంబర్ నెలకల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ధరణి తనను కలిసి మీడియాతో చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. మగధీర తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవటంతో మంచి క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బేనర్ పై ఈ చిత్రం రూపొందుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu