»   »  ‘జగదీకవీరుడు-అతిలోకసుందరి’ సీక్వెల్ లో రామ్ చరణ్ తేజ!

‘జగదీకవీరుడు-అతిలోకసుందరి’ సీక్వెల్ లో రామ్ చరణ్ తేజ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మానంలో మెగాస్టార్ చిరంజీవి, అందలా తార శ్రీదేవి జంటగా 'జగదీకవీరుడు-అతిలోకసుందరి" చిత్రం రూపొందింది. ఈ సినిమా అప్పుట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆర్య 2 సీక్వెల్ సినిమా లాగా జగదీకవీరుడు-అతిలోకసుందరి సినిమాకి సీక్వెల్ రూపొందించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రామ్ చరణ్ తేజ హీరోగా రూపొందే ఈ చిత్రం ద్వారా శ్రీదేవి తనయ జాహ్నవిని కథానాయికగా పరిచయం చేయనున్నారని సమాచారం.

2014వ సంవత్సరంలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుందట. బోనీకపూర్, శ్రీదేవిల దగ్గర ఈ విషయం గురించి చిరంజీవి చర్చించాడట. ఈ ప్రపోజల్ కు బోనీకపూర్, శ్రీదేవిలు కూడా ఒప్పుకున్నారని తెలుస్తోంది. కాగా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయుటకు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందించనున్నారని సమాచారము.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu