»   »  రెండేళ్ల క్రితం ఆపిన రామ్ చరణ్...ఇప్పుడు మళ్లీ

రెండేళ్ల క్రితం ఆపిన రామ్ చరణ్...ఇప్పుడు మళ్లీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: క్రియేటివ్ డిఫరెన్సెస్ తో సినిమాలు ఆగిపోవటం తరుచూ చూస్తూంటాం. అయితే మళ్లీ ఆ దర్శకుడు ఫామ్ లోకి రాగానే ఆ హీరోలే పిలిచి సినిమాలు ఇస్తూంటారు. సక్సెస్ అనేది సినిమావాళ్లకు ప్రాణం కాబట్టి ఇలాంటివి కామన్. రీసెంట్ గా రామ్ చరణ్ సైతం తన ఆగిన ప్రాజెక్టుని మళ్లీ మొదలెట్టాలనే నిర్ణయనికి వచ్చినట్లు సమాచారం.

రామ్ చరణ్ హీరోగా, కొరటాల శివ డైరక్షన్ లో, బండ్ల రణేష్ నిర్మాణంలో ఓ సినిమా చాలా గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. కాని కొద్ది రోజుల తర్వాత. ఈ సినిమా దాదావు రద్దయిందని, దానికి కారణంగా క్రియోటివిటి డిఫరెన్సే అని, సరైన ఫ్లానింగ్ లోపాలే అని వార్తలు వచ్చి ఆగిపోయింది.

సరిగ్గా అదే సమయంలో రామ్ చరణ్ గోవిందుడు అందరివాడు తో ముందుకు వెళ్ళగా, శివ మహేష్ తో శ్రీమంతుడు మొదలెట్టారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాతా మళ్ళీ ఈ ప్రాజెక్టు గురించి టాలీవుడ్ లో చర్చ మెదలైంది.

 Ram Charan-Koratala Siva Project on

ఇదే సినిమా మళ్ళీ పట్టాలెక్కబోతోందని వినబడుతోంది. రామ్ చరణ్ రీసెంట్ గా కొరటాల తో ఈ విషయమై మాట్లాడినట్లు సమాచారం. కొరటాల కూడా చాలా ఉత్సాహంగా..రామ్ చరణ్ తో చేయటానికి సిద్దం అని, త్వరలో కథ చెప్తానన్నారని టాక్.

ఇదే కనుక నిజం అయితే శివకు ఇది నాలుగో సినిమా అవుతుంది. ప్రస్తుతం జనతా గ్యారేజ్ తో బిజిగా వున్నాడు శివ. ప్రస్తుతం రామ్ చరణ్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. తన తాజా చిత్రం తని ఒరువన్ రీమెక్ తప్ప వేరే ప్రాజెక్టులకు సైన్ చేయ్యలేదు. బహుశ త్రివిక్రమ్ గాని, సుకుమార్ తో గాని లేదా కొరటాలతో గాని ఉండోచ్చని టాలీవుడ్ టాక్.

English summary
Plans were on track to revive Ram Charan-Koratala Siva's crazy venture.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X