twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు-పవన్ విభేదాలే... రామ్ చరణ్ చిత్రం కథ?

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామ్ చరణ్, కాజల్ జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో శివబాబు బండ్ల సమర్పణలో,పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం గోవిందుడు అందరి వాడేలా. ఈ చిత్రం యూనిట్ ఇటీవల పొలాచ్చి షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరి ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఈ చిత్రం కథాంశం తన సొంత ఇంట్లో జరుగుతున్న పోరే ప్రధానాంశంగా ఉంటుందని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

    ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న దాన్ని బట్టి... కథలో రామ్ చరణ్ తండ్రికి, బాబాయ్ కి మధ్య అభిప్రాయ భేధాలు ఉండి విడిపోతారు. అయితే అలా విడిపోవటం రామ్ చరణ్ తాతకు ఇష్టం ఉండదు. ఈ నేపధ్యంలో ఎన్నారై అయిన రామ్ చరణ్ ఊళ్లోకి దిగుతాడు. చిన్నప్పటినుంచీ తనని ఎత్తుకుని మోసిన బాబాయ్,తన తండ్రి మాటే వేద వాక్కుగా భావించే బాబాయ్...ఇలా దూరంగా ఉండటం చూసి తట్టుకోలేకపోతాడు. దాంతో ఇద్దరి మధ్యా సయోధ్యకు ప్రయత్నించి సాధిస్తాడు. ఈ క్రమంలో అతను పడే ఇబ్బందులు ఏమిటి అనేది సినిమా కథ. ఈ కథని రామ్ చరణ్ తండ్రి(చిరంజీవి), బాబాయ్ పవన్ కి మధ్య జరుగుతున్న అభిప్రాయ బేధాలని బేస్ చేసుకుని అల్లిన కథగా అభివర్ణిస్తున్నారు. అయితే ఇందులో నిజమేమిటన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ దాకా ఆగాల్సిందే.

     Ram Charan

    చిత్రం షెడ్యూల్ విషయానికి వస్తే... ఏప్రిల్ రెండవ వారం నుండి హైదరాబాద్ రామానాయుడు సినీ విలేజ్ లోని హౌస్ సెట్ లో, రామోజీ ఫిలిం సిటీలో చిత్రంలోని ప్రధాన తారాగణం అంతా నటించే భారీ షెడ్యూల్ దాదాపు 40 రోజులు జరుగుతుంది.

    నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ... మా సినిమా ఫిబ్రవరి 6 న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి కన్యాకుమారి, పొలాచ్చి లోని అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరిగింది. ఏప్రిల్ 2 వ వారం నుండి హైదరాబాద్, రామానాయుడు సినీ విలేజ్ లో రామోజీ ఫిలిం సిటీ లో ప్రధాన తారాగణం అంతా పాల్గొనే సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ఈ షెడ్యూల్ దాదాపు 40 రోజులు జరుగుతుంది. దీని తరువాత ఫారిన్ లో సాంగ్స్ చిత్రీకరణ జరుగుతుంది.

    రామ్ చరణ్, కాజల్, కాజ్ కిరణ్, శ్రీకాంత్ కాంబినేషన్ లో చిత్రీకరించిన సన్నివేశాలు సూపర్బ్ గా రావడమే కాకుండా చాలా వినోదాత్మకంగా ఉంటాయి. అందరూ ఎంజాయ్ చేస్తూ నటిస్తున్నారు. శ్రీకాంత్ కి జోడిగా కమిలిని ముఖర్జి నటిస్తున్నారు. చక్కటి ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా తెలుగు సంప్రదాయాలు ఉట్టి పడేలా దర్శకుడు కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తెరెక్కిస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు అన్నారు.

    English summary
    Ram Charan Teja-Krishna Vamsi Film Story revolves around Charan's father's fallout with his brother and how the actor attempts to patch up. Srikanth is playing the role of Pawan's uncle while nobody has been finalised yet to play the role of Charan's father.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X