»   »  రామ్ చరణ్ కి, మహేష్ కి ఆమే?

రామ్ చరణ్ కి, మహేష్ కి ఆమే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'నేను- శైలజ' అంటూ టాలీవుడ్ ని పలకరించిన మళయాలి బ్యాటీ కీర్తి సురేష్. ఆ చిత్రం విజయవంతం అవటం రామ్ కు ఎంత వరకూ కలిసి వచ్చిందో కానీ ఆమె మాత్రం ఫుల్ బిజీ అవుతోంది. వరస ఆఫర్స్ వచ్చి పడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాల్లో ఆమెను అడుతున్నట్లు సమాచారం. మహేష్, రామ చరణ్ కొత్త ప్రాజెక్టులలో సైతం ఆమె చేసే అవకాసం ఉందని తెలుస్తోంది.

Ram Charan, Mahesh romances with Keerthy Suresh?

వివరాల్లోకి వెళితే...త్వరలో మెదలవబోతున్న మహేష్, మురుగుదాస్ కాంబినేషన్ లో చిత్రంలో హీరోయిన్ గా ఫైనలైజ్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు ఆమెను మురగదాస్ ఫొటో షూట్ చేయించినట్లు చెప్పుకుంటున్నారు. బ్రహ్మోత్సవం షూటింగ్ లో బిజిగా వున్న మహేష్ బాబు త్వరలో ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ అవుతారు.

అలాగే ఈ చిత్రంతో పాటు ఆమె రామ్ చరణ్ సరసన నటించనుందని చెప్తున్నారు. తమిళ సూపర్ హిట్ తని ఒరువన్ రీమెక్ కు సైతం ఆమెను అడుగుతున్నారని, తమిళంలో నయనతార చేసిన పాత్రను ఆమె చేయనుందని టాక్.

Ram Charan, Mahesh romances with Keerthy Suresh?

కీర్తి సురేష్...నేను శైలజా హిట్ అవ్వడంతో పాటు, తన నటనతో కూడా అందరి మనస్సులు దోచుకుంది. దీంతో వరుసపెట్టి అఫర్స్ అన్ని ఈమె దగ్గరికి క్యూ కడుతున్నాయి. అయితే తొలి సారిగా.. ‘అయినా నువ్వు ఇష్టం' సినిమాతో హీరోయిన్ అయ్యింది. కాకపోతే ఈ సినిమా ఇప్పటికి రిలీజ్ అవ్వలేదు. దీనికి విజయ నిర్మల మనవడు అంటే నరేష్ కుమారుడు హీరో.

English summary
Buzz is Murugadoss finalized Keerthy Suresh as heroine in Mahesh's next movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu