»   »  'ఎక్స్ ప్రెస్ రాజా': రిజల్ట్ చూసి రామ్ చరణ్ నిర్ణయం

'ఎక్స్ ప్రెస్ రాజా': రిజల్ట్ చూసి రామ్ చరణ్ నిర్ణయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : శర్వానంద్ తాజా చిత్రం 'ఎక్స్ ప్రెస్ రాజా' ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిజల్ట్ కోసం చిత్రం హీరో శర్వానంద్ కన్నా రామ్ చరణ్ ఎక్కువ ఆశక్తిగా ఎదురు చూస్తున్నట్లు సమాచారం. అందుకు కారణం ఏమిటీ అంటే...

'ఎక్స్ ప్రెస్ రాజా' సినిమాకు డైరక్టర్ మెర్లపాక గాంధీ. గతంలో ఇతను వెంకాటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హిట్ కొట్టాడుడు. ఇదే ఊపులో ఓ కథ సిద్దం చేసుకుని రామ్ చరన్ కి చెప్పాడు. అయితే చెర్రికి కథ నచ్చింది కానీ.. సంక్రాంతి తర్వాత కలవమని అన్నాడట. దీనికి కారణం ఎక్స్ ప్రెస్ రాజా సినిమా ఎలా తీసాడో అని తెలుసుకోవడం కోసమేనని సమాచారం.

దాంతో సంక్రాంతి బరిలో ముగ్గురు పెద్ద హీరోలతో ముందుకు వస్తున్న ఈ సినిమా రిజల్ట్ ఎమౌతుందో అని మెగా క్యాంప్ సైతం ఎదురుచూస్తోంది.శర్వానంద్‌, సురభి జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా'. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న ఈ చిత్రం టీమ్ ప్రమేషన్స్ వేగం పెంచింది. అందులో భాగంగా ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ గా మారిన డంబాష్ పోటిని నిర్వహిస్తోంది.

Ram Charan-Merlapaka Gandhi combo soon?

''వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తుండగానే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. బ్రహ్మాజీ ద్వారా శర్వానంద్‌ని కలిసి కథ చెప్పాను. శర్వానంద్‌ను డైరెక్ట్‌ చేయడమంటే బెంజ్‌కారును డ్రైవ్‌ చేయడం లాంటిది. చాలాస్మూత్‌గా, కూల్‌గా ఉంటారు. యు.వి.క్రియేషన్‌ వంటి మంచి బ్యానర్‌లో పనిచేయడం ఆనందంగా ఉంది' అని దర్శకుడు తెలిపారు.

శర్వానంద్‌ మాట్లాడుతూ, 'ఈ సినిమాకు కథే హీరో. సినిమాలో ప్రతి పాత్ర కీలకమైనదే. యు.వి.క్రియేషన్‌ నా సొంత సంస్థ లాంటిది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను' అని చెప్పారు.

దిల్‌రాజు మాట్లాడుతూ, 'ఈ చిత్ర నిర్మాతలు గొప్ప సినిమాలను నిర్మిస్తున్నారు. యు.వి.క్రియేషన్‌ అంటే ప్రభాస్‌కిది బినామీ లాంటిది. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రం పెద్ద హిట్‌ అవుతుంది' అని తెలిపారు.

English summary
According to the latest, it is coming out that Merlapaka Gandhi narrated a story to Ram Charan who liked it completely. Cherry promised to get back to him after sankranthi.
Please Wait while comments are loading...