»   » ఇక రామ్ చరణ్ కి పేరు ముందు అది వద్దంట

ఇక రామ్ చరణ్ కి పేరు ముందు అది వద్దంట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పరిస్ధితులు మారిపోయినప్పుడు లెక్కలు మారిపోతూంటాయి. ఇప్పుడు రామ్ చరణ్ కి తన కుటుంబం పార్టీల వారీగా విడిపోయిన నేపధ్యంలో తన పేరు ముందు ఉండే మెగా పవర్ స్టార్ అనే నిక్ నేమ్ ని వదిలించుకోవాలనిపిస్తోందిట. అప్పట్లో రామ్ చరణ్ లాంచ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ కు ఉన్న పవర్ స్టార్ కి, చిరంజీవికి ఉన్న మెగా స్టార్ కలిపి మెగా పవర్ స్టార్ అనే బిరుదు ఇచ్చేసింది మీడియా. ఇప్పుడు దాన్ని ఎట్టిపరిస్ధితుల్లోనూ వదిలించుకోవాలని చిరంజీవి సైతం భావిస్తున్నారట. ఈ మేరకు ఆయన రామ్ చరణ్ తాజా చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' లో ఆ పేరు వేయవద్దని, మెగాస్టార్ వేయమని చెప్పాడని ఫిల్మ్ నగర్ సమాచారం.

ఇక రామ్ చరణ్,కృష్ణ వంశీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం టైటిల్ 'గోవిందుడు అందరివాడేలే' . ఈ టైటిల్ గతంలో చిరంజీవి చిత్రం అందరివాడులోని టైటిల్ సాంగ్ నుంచి తీసుకున్నది కావటం విశేషం. కాజల్‌ హీరోయిన్. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో చరణ్‌ పల్లెలో అడుగుపెట్టే ఎన్నారై పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యూనిట్‌ కన్యాకుమారి, పొలాచ్చి షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుని హైదరాబాద్‌ చేరింది.

Ram Charan no more Mega Power Star

నిర్మాత మాట్లాడుతూ ''తెలుగుదనం ఉట్టిపడే కథ కథనాలతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇటీవలే కన్యాకుమారి, పొల్లాచ్చి, రామేశ్వరంలో కీలక సన్నివేశాలు తెరకెక్కించాం. రామోజీఫిల్మ్‌సిటీలో కొంతభాగం తెరకెక్కిస్తాం. విదేశాల్లో పాటల్ని చిత్రీకరిస్తాం. రామ్‌చరణ్‌, రాజ్‌కిరణ్‌, శ్రీకాంత్‌ల మధ్య తెరకెక్కించిన సన్నివేశాలు.. ఇంటిల్లిపాదినీ ఆకట్టుకొనేలా ఉన్నాయి'' అన్నారు.

చాలా కాలం తర్వాత సొంతగడ్డపై అడుగుపెట్టిన ప్రవాస భారతీయుడిగా పోనీ టెయిల్‌తో కనిపించబోతున్నాడు రామ్‌చరణ్‌. తాత, మనవడుగా రాజ్‌కిరణ్‌, చరణ్‌ల నటన చిత్రానికి ప్రధానాకర్షణగా నిలవబోతోంది. ఇందులో ప్రధాన పాత్రధారుల ఆహార్యం, ఆభరణాలు అన్నీ కొత్తగా ఉండబోతున్నాయి. ఇందులో రామ్‌చరణ్‌ పంచెకట్టుతో ఎడ్లబండిపై తన తాత పాత్రధారి రాజ్‌కిరణ్‌తో తిరుగుతూ కనిపిస్తాడు.

ఈ చిత్రంలో తమిళంలో విలక్షణ నటుడుగా పేరుగాంచిన రాజ్ కిరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా, శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

English summary

 The buzz in T wood is that theRam Charan is now extremely uncomfortable with the title, Mega Power Star. 
 Reportedly, Chiranjeevi also urged him to get rid of the title and gave him a new one, Mega Star. His latest movie, Govindudu Andari Vaadele, will also introduce him as Mega Star
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu