»   »  నమ్ముకున్న రామ్ చరణ్ కూడా నో చెప్పాడట

నమ్ముకున్న రామ్ చరణ్ కూడా నో చెప్పాడట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండస్ట్రీలో ఎన్ని లెక్కలున్నా ప్రధానంగా హిట్, ఫ్లాఫ్ అనేవే ఎవరి కెరీర్ ని అయినా డిసైడ్ చేస్తూంటాయి. ముఖ్యంగా ఇప్పుడున్న పెద్ద హీరోలు ఎవరూ సోసో గా ఆడిన దర్శకులతో చిత్రాలు చేయటానికి ఉత్సాహం చూపించటం లేదు. రామ్ చరణ్ కూడా బ్రూస్ లీ డిజాస్టర్ తర్వాత అదే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగానే సంపత్ నందికి రీసెంట్ గా నో చెప్పినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్, సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన రచ్చ హిట్. దాంతో ఒక్కసారిగా ఓవర్ నైట్ లో సంపత్ నంది స్టార్ డైరక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. ఆ తర్వాతే కష్టాలు మొదలయ్యాయి.

Ram Charan no to Sampant Nandi's Chota Mestri?

సంపత్ కి తదుపరి పవన్ నుంచి ఆహ్వానం వచ్చింది. పవన్‌కళ్యాణ్‌ తన 'గబ్బర్‌సింగ్‌ 2' చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశాన్ని ఇచ్చారు. అయితే స్క్రిప్టు సమయంలోనే పొత్తు కుదరక..ప్రారంభమైన ప్రాజెక్టు ఆగిపోయింది.

దాంతో ఏదో విధంగా ఆ విషయం నుంచి బయిడపడాలని సంపత్‌ నంది 'బెంగాల్‌ టైగర్‌' తీసాడు. రవితేజ హీరోగా వచ్చిన ఆ చిత్రం ఓపెనింగ్‌ తెచ్చుకున్నా కానీ భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కురిపించలేక చతికిల పడింది. దాంతో అందరూ పవన్ దే బెస్ట్ డెసిషన్ అన్నారు. ఇప్పుడు బెంగాల్ టైగర్ ప్రభావమే అతనికి తదుపరి చిత్రాలకు అడ్డుపడుతోంది.

Ram Charan no to Sampant Nandi's Chota Mestri?

దాంతో సంపత్ నంది..ఎప్పటినుంచో చెప్తున్న చోటా మేస్త్రి కథను బయిటకు తీసి రీసెంట్ గా రామ్ చరణ్ కు వినిపించారు. అయితే అదీ కూడా రచ్చ ఫార్మెట్ లోనే ఉండటంతో రామ్ చరణ్ కి నచ్చలేదని టాక్. దాంతో తను ఇలాంటి కథతో చేయలేనని, అయినా ఇప్పుడు తాను పూర్తి బిజీగా ఉన్నానని చెప్పాడని చెప్పుకుంటున్నారు.

English summary
Bengal Tiger movie result is crucial for Sampath Nandi right now , it is not easy for him to do a film with cherry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu