»   » మణిరత్నం చిత్రంలో రాంచరణ్ సోలో కాదట.. విజయ్, విక్రమ్

మణిరత్నం చిత్రంలో రాంచరణ్ సోలో కాదట.. విజయ్, విక్రమ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెలియా చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తో దర్శకుడు మణిరత్నం ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ రూమర్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. మణిరత్నం చిత్రం మల్టీ స్టారర్ అని ఓ వార్త వినిపిస్తున్నది. ఆ చిత్రంలో రాంచరణ్ ఒక్కడే హీరో కాదని, ఇంకా ఇద్దరు అగ్రహీరోలు ఉన్నట్టు తెలుస్తున్నది.

దళపతి కథ మాదిరిగానే.. మల్టీ స్టారర్

దళపతి కథ మాదిరిగానే.. మల్టీ స్టారర్

దక్షిణాది సూపర్‌స్టార్లు రజనీకాంత్, మమ్ముట్టితో మణిరత్నం రూపొందించిన దళపతి చిత్రం మాదిరిగానే రాంచరణ్ ఉంటుందట. ఈ చిత్రంలో చెర్రీతోపాటు తమిళ్ సూపర్ స్టార్ విజయ్, విక్రమ్ కూడా నటిస్తున్నారనే వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో నటించేందుకు వారు ఇప్పటికే అంగీకారం తెలిపినట్టు సమాచారం.

చెలియా చిత్రం తర్వాత పట్టాలపైకి

చెలియా చిత్రం తర్వాత పట్టాలపైకి

చెలియ చిత్రం పనులు పూర్తికాగానే ఈ మెగా ప్రాజెక్ట్ జూన్‌లో ప్రారంభించే అవకాశం ఉంది. మణిరత్నం స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం లోకేషన్స్ ఎంపిక వేటలో ఉన్నట్టు సమాచారం. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనున్నది.

లోకేషన్ వేటలో మణిరత్నం

లోకేషన్ వేటలో మణిరత్నం

ప్రస్తుతం మణిరత్నం టీమ్ ఈ కొత్త కాంబో చిత్రానికి లొకేషన్స్ ఫైనలైజ్ చేస్తున్నారని వినికిడి. తమిళ,తెలుగు,హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాని మణిరత్నం స్వయంగా నిర్మించనున్నారు.

తమిళ పరిశ్రమపై రాంచరణ్ దృష్టి

తమిళ పరిశ్రమపై రాంచరణ్ దృష్టి

మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం రావడంపై రాంచరణ్ సంతోషంగా ఉన్నారట. ఈ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు దగ్గర కావాలనే ప్రయత్నం చెర్రీ చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం జూన్ నుంచి మణిరత్నానికి డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తున్నది.

English summary
Ram Charan not solo hero in Maniratnam movie. Vijay, Vikram are acting in this movie. Thye already given nod to Maniratnam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu