»   » సమస్యల్లో....రామ్ చరణ్ షూటింగ్

సమస్యల్లో....రామ్ చరణ్ షూటింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ హీరోగా రెడీ అవుతున్న ఆరెంజ్(వర్కింగ్ టైటిల్) చిత్రం సమస్యల్లో పడిందని తెలుస్తోంది. ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న దాని ప్రకారం. షూటింగ్ షెడ్యుల్ సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవటం, శని, ఆది వారాలు శెలవలు లెక్కవేయకపోవటంతో ఎంతో ఖర్చుతో కూడుకున్న షూటింగ్ రోజులు అన్ ప్రొడక్టివ్ గా మిగిలిపోతున్నాయంటున్నారు. అలాగే మొదట అమెరికాలో షూటింగ్ చేద్దామనుకుని లొకేషన్స్ ఎంపిక చేసుకుని తర్వాత మెలబోర్న్ లో లాండవటం కూడా కొన్ని అంతర్గత సమస్యలు తెచ్చిపెట్టిందంటున్నారు. ఇక అక్కడ ఫుడ్ పెట్టే విషయంలో కూడా యూనిట్ మొత్తం డిజప్పాయింట్ చెందిందని, దానితో నిర్మాత నాగబాబు బావమరిదితో దర్శకుడుకి కొన్ని విభేధాలు పొడచూపాయని చెప్తున్నారు. అలాగే ఇప్పటికే అనుకున్న బడ్జెట్ కన్నా మూడు రెట్లు పెంచటం కూడా నిర్మాతను ఇబ్బందిలో పడేసే అంశమేనంటున్నారు. ఇక ఈ చిత్రంలో జెనీలియా హీరోయిన్ గా చేస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందిస్తున్నారని చెప్తున్నారు. మగధీర వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత రానున్న ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu