»   » ఐపియల్ పై పట్టు పెంచుకొంటున్న రామ్ చరణ్!

ఐపియల్ పై పట్టు పెంచుకొంటున్న రామ్ చరణ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెప్సీ శీతల పానీయానికి అంబాసిడర్ గా రామ్ చరణ్ క్రికెట్ ధనాధన్ ధోని తో కలిసి యాడ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరితో షూటింగ్ జరిగిన ఆ కొద్ది గంటల్లో ధోని ఐపిఎల్ వ్యవహారాల గూర్చి బాగానే ఎక్కించినట్లుంది. ఇప్పటికే టాలీవుడ్ నుండి రాణా, వెంకటేష్, సిద్ధార్థ ఐపిఎల్ మ్యాచ్ లలో ప్రేక్షకుల నడుమ కనిపిస్తు క్రీదాకారులను ఉత్సాహ పరుస్తున్న విషయం విదితమే.

ఎంతోకాలంగా ప్రతిపాదనల దశలోనే ఆగిపోయి రక రకాల కారణాల వల్ల వాయిదాలు పడుతూ వస్తోన్న 'టాలీవుడ్ క్రికెట్ మ్యాచ్" ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. వచ్చే నెల జూన్ 13న హైదరాబాదులోని ఎల్.బి స్టేడియం లో 'మా" అసోషియేషన్ నిర్వహించనున్న ట్వంటీ20లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతూ ప్రాక్టీస్ ప్రారంభిస్తానని చెప్తున్న రామ్ చరణ్ ఐపిఎల్ బిజినెస్ లోనూ పాల్గొనేందుకు సిద్దమవుతున్నాడట. అందుకు ధోనీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫిలింవర్గాల కథనం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu