»   » ఏంటి.. రామ్ చరణ్ చేత సుకుమార్ ఆ క్యారక్టర్ చేయిస్తున్నారా ? అంతా షాక్

ఏంటి.. రామ్ చరణ్ చేత సుకుమార్ ఆ క్యారక్టర్ చేయిస్తున్నారా ? అంతా షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అప్పట్లో స్టార్ హీరోలు సైతం అవిటివారుగా, అంధులుగా, అంద వికారులుగా రకరకాల పాత్రల్లో చేసి మెప్పించేవారు. అయితే యంగ్ జనరేషన్ లో ఎవరూ అటువంటి సాహసాలు చేయటం లేదు. హీరో అంటే ఎప్పుడూ అందంగా, మంచివాడుగా ఉంటూ మంచిని రక్షిస్తూ కాలం గడుపుతూండే ఫార్ములాతో ముందుకు వెళ్తున్నారు. కానీ ఇప్పుడిప్పుడే మళ్లీ తెలుగు సినిమా సీన్ మారుతోంది.

కొత్త తరహా పాత్రలకు ప్రాణం పోయాలని హీరోలు ఉత్సాహం చూపుతున్నారు. నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ ..టెంపర్ లో మెప్పించారు. అలాగే ఇప్పుడు రామ్ చరణ్ ...చెవిటి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. పుట్టుక తోటే కొద్ది పాటి చెవుడుతో ఈ పాత్ర ని దర్శకుడు సుకుమార్ స్పెషల్ గా డిజైన్ చేసారట. సినిమా మొత్తం రగ్గడ్ లుక్ తో, కొద్దిపాటి గెడ్డంతో రామ్ చరణ్ కనిపించనున్నారు.

Ram Charan to play deaf in sukumar's movie?

పూర్తి వివరాల్లోకి వెళితే... రామ్ చరణ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లోనే సుకుమార్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో చరణ్ పాత్ర గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

పూర్తి గ్రామీణ నైపథ్యంలో సాగే ఈ చిత్రంలో చరణ్ కూడా ఓ పల్లెటూరి వాడిలా కనిపిస్తాడట. 1990 లలో జరిగే ఈ ప్రేమ కథలో చరణ్ పోషించబోయే పాత్రకు చెవుడు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మాస్ పాత్రలను చేసిన చరణ్ హీరోగా తన నటన పరిపక్వత చూపించడానికి ఈపాత్రను అంగీకరించాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రానికి సుకుమార్ తనదైన శైలిలో స్క్రీన్ ప్లేను రాశారట. ఇదే సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. ఇందులో కుటుంబపరమైన ఎమోషన్లకు పెద్ద పీట వేసారట సుకుమార్. కోనసీమ బ్యాక్ డ్రాప్‌లో ఈ కథ కొనసాగుతుందనీ.. కోనసీమ కుర్రోడుగా చరణ్ కనిపిస్తాడని సినీవర్గాలు అంటున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ కథను సుకుమార్ సిద్ధం చేశాడట.

ఈ సినిమాకు సంగీతం కూడా దేవిశ్రీ ప్రసాద్ అందిస్తాడని తెలుస్తోంది. ఈ మధ్య రామ్ చరణ్ రొటీన్ కమర్షియల్ సినిమాలు చేసి బోల్తా పడుతున్నారు. ధృవ తో కాస్త డిఫెరెంట్ గా వెళ్ళి ఒడ్డున పడ్డారు. అందుకే ఈసారి తెగింపు నిర్ణయం తీసుకున్నాడని, సుకుమార్ తో ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నాడని అంటున్నారు.

English summary
Ram Charan plays the role of a rural guy who has some hearing problem, which will be directed by Sukumar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu