»   » సినిమా సినిమాకీ రెమ్యునేషన్ పెంచుతున్న రామ్ చరణ్

సినిమా సినిమాకీ రెమ్యునేషన్ పెంచుతున్న రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ చేసినవి మూడు చిత్రాలే అయినా అతను ఆరు కోట్ల రెమ్యునేషన్ తీసుకునే స్ధాయికి ఎదిగాడని చెప్తున్నారు. అతని తాజా చిత్రం మెరుపు కోసం రామ్ చరణ్ ఈ మెత్తం వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక మొదటి చిత్రం చిరుతకి సైతం రెండు కోట్లు, అలాగే మగధీర నిమిత్తం నాలుగు కోట్లు, ఆరెంజ్ కి ఐదు కోట్లు వసూలు చేసాడని, అవన్నీ తమ సొంత బ్యానర్స్ అయినా తన డిమాండ్, క్రేజ్ పెంచుకోవటానికి తీసుకున్నాడని, దాంతో మెరుపు వద్దకు వచ్చేసరికి ఆరు కోట్లు డిమాండ్ చేసాడని చెప్తున్నారు. ఇక ఇలా తీసుకున్న డబ్బులతో తన తండ్రి పుట్టిన రోజు గిప్ట్ గా నాలుగు కోట్లు ఖర్చు పెట్టి రోల్స్ రాయిస్ కారుని తీసుకున్నాడని చెప్తున్నారు. ఇక మిగతా డబ్బులను తన తండ్రితో తీయబోయే చిత్రానికి ఖర్చుపెడతాడట. మొత్తానకి పూర్తి బిజెనెస్ మైండ్ తోనే కెరీర్ లో రామ్ చరణ్ దూసుకుపోతున్నాడన్నమాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu