»   »  ఇంకో రీమేక్ కు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్

ఇంకో రీమేక్ కు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: రామ్ చరణ్ ..బ్రూస్ లీ చిత్రం పరాజయంతో పూర్తి గా సేఫ్ గేమ్ ఆడాలని నిర్ణయించుకున్నట్లున్నారు. అందులో భాగంగానే ఆయన మినిమం గ్యారెంటీ కోసం ..తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన తని ఒరవన్ రీమేక్ రైట్స్ తీసుకున్నారు. సురేంద్ర రెడ్డి ఈ చిత్రం రీమేక్ భాధ్యతలు తీసుకున్నారు. తెలుగు నేటివిటితో రూపొందనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది.

ఇదే ఊపులో ఆయన మరో రీమేక్ ని సైతం ఓకే చేసినట్లు సమాచారం. జాన్ అబ్రహం హీరోగా రూపొందుతున్న రాకీ హ్యాండ్సమ్ చిత్రాన్ని ఆయన రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో చేస్తున్న శృతి హాసన్ ద్వారా ఈ కథ గురించి తెలుసుకున్న రామ్ చరణ్ ...జాన్ అబ్రహం ను ఎప్రోచ్ అయ్యాడని చెప్తున్నారు. అనుకున్నట్లుగా జరిగితే ఈ ప్రాజెక్టు..తని ఒరువన్ అనంతరం పట్టాలు ఎక్కుతుంది.


నటుడు, నిర్మాత జాన్ అబ్రహం..తన తాజా చిత్రం రాకీ హ్యాండ్సమ్ తో యాక్షన్ ని మరో కొత్త లెవిల్ కు తీసుకు వెళ్లారు. ఆయన ఇప్పుడు తన చిత్రాన్ని తెలుగు,తమిళ భాషల్లో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు.
Ram Charan in 'Rocky Handsome' Remake!

జాన్ అబ్రహం మాట్లాడుతూ..."మేం మా సినిమాను సౌత్ కు రీమేక్ చేయాలనకుంటున్నాం. ఈ సినిమాపై ఇంట్రస్ట్ ఉన్న సూపర్ స్టార్ తో టచ్ లోకి వెళ్తాం. హైదరాబాద్ లోని ఇద్దరు ముగ్గరు హీరోలు చూసి తెలుగు,తమిళంలో చేయటానికి ఇంట్రస్ట్ చూపారు. ఎందుకంటే ఇది చాలా కమర్షియల్ ప్రాజెక్టు. ఇలాంటి ఆఫర్స్ రావటం చాలా ఎగ్జైట్ మెంట్ గా ఉంది ." అన్నారు.

ఇక ఆ హీరోలు ఎవరనేది చెప్పటానికి జాన్ అబ్రహం ఆసక్తి చూపలేదు. ఈ సినిమా యుఎస్ పి గురించి చెప్తూ... కేవలం యాక్షన్ మాత్రమే కాక ఈ సినిమాలో ఎమోషన్ కూడా మిళితమై ఉంది అన్నారు. రాకీ హ్యాండ్సమ్‌ చిత్రానికి నిషి కామత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

రాకీ హ్యాండ్సమ్ చిత్రంలో శృతి అతిథి పాత్ర పోషిస్తోంది. శృతి ప్రస్తుతం రెండు హిందీ చిత్రాల్లో నటిస్తుంది. బిజి షెడ్యూల్‌లో కూడా రాకీ హ్యాండ్సమ్ చిత్రానికి శృతి డేట్స్ కేటాయించింది. తొలుత శృతిహాసన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుందని చెప్పారు. ఇప్పుడు అతిథి పాత్ర అని సమాచారం. కథ పాత్ర నచ్చడంతో శృతి ఓకే చెప్పిందట. హీరో, హీరోయిన్‌లతో పాటు ప్రధానమైన పాత్ర అంటున్నారు.

English summary
Ram Charan is keen on doing one more Remake. It's John Abraham's action thriller 'Rocky Handsome'.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu