Just In
- 1 min ago
అలాంటి సమయంలో పర్సనల్‌గా ఫోన్.. నరేష్‌పై పవిత్రా లోకేష్ కామెంట్స్
- 58 min ago
అది మాత్రం కంపల్సరీ అంటూ... గోవాలో రాశీ ఖన్నా రచ్చ
- 1 hr ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
- 1 hr ago
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
Don't Miss!
- Finance
IMF చీఫ్ గీతా గోపినాథ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు, ఏం మాటలు అంటూ నెటిజన్ల అసహనం
- News
ఎస్సై ఆత్మహత్యను రాజకీయంగా వాడుకుంటారా ? చంద్రబాబు, దేవినేని ఉమపై పోలీస్ అధికారుల సంఘం ధ్వజం
- Sports
IPL 2021: చెన్నై జట్టులోకి రాబిన్ ఊతప్ప.. మీరు మారరంటూ ఫ్యాన్స్ ఫైర్!
- Automobiles
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రామ్ చరణ్ సలహాలో మార్చిన శ్రీను వైట్ల
హైదరాబాద్ : శ్రీను వైట్ల సినిమాలన్నీ తొలినుంచీ రొమాంటిక్ కామెడీలుగా సాగుతూ వస్తున్నాయి. అయితే మహేష్ తో చేసిన దూకుడు చిత్రంతో యాక్షన్ కామెడీలను మొదలెట్టారు. అయితే ఆగడు చిత్రం డిజాస్టర్ కావటంతో మరోసారి తన జానర్ మార్చాల్సిన సమయం వచ్చిందని రామ్ చరణ్ భావిస్తున్నట్లుగా చెప్తున్నారు. రామ్ చరణ్ తనతో యాక్షన్ కామెడీ చేయవద్దని చెప్పినట్లు సమాచారం.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
దాంతో శ్రీను వైట్ల చాలా కథలు నేరేట్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీను వైట్ల చెప్పిన రకరకాల స్టోరీలు, స్టోరీ పాయింట్లు విన్నాక... ఓ సస్పెన్స్ థ్రిల్లర్ వైపు రామ్ చరణ్ మ్రెగ్గు చూపినట్లు చెప్పుకుంటున్నారు. ఆ సస్పెన్స్ థ్రిల్లర్ ని కామెడీ తో చెప్పమని రామ్ చరణ్ అన్నట్లు గా తెలుస్తోంది. దాంతో ప్రస్తుతం తన జానర్ మార్చుకుని కథలో సస్పెన్స్ ని, థ్రిల్లింగ్ ని మెయింటైన్ చేస్తూ కథని వండుతున్నాడుట శ్రీను వైట్ల. మార్చి నుంచి ఈ చిత్రం పట్టాలు ఎక్కే అవకాసముందని తెలుస్తోంది.

శ్రీను వైట్ల దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఫిలింనగర్ వర్గాల నుండి సమాచారం. ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ టైటిల్ విషయమై ఇప్పటి వరకు అటు రామ్ చరణ్ నుండి గానీ,
ఇటు శ్రీను వైట్ల నుండి గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రంలోని ‘మన భారతంలో పాండవులు, కౌరవులు రాజాలు రా' అనే సాంగ్ నుండి ఈ మూవీ టైటిల్ స్వీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే టైటిల్ ఫైనల్ చేస్తారా? లేక మరేదైనా టైటిల్ పరిశీలిస్తారా? అనేదానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఈ చిత్రం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది.
క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించనున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. తిరిగి త్వరలో షూటింగ్లో పాల్గొంటారు.