twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గోవిందుడు అందరివాడేలే' టాక్ ఏంటి?

    By Srikanya
    |

    హైదరాబాద్ : భారీ అంచనాల నడుమ ఈ రోజు బెనిఫిట్ షోలతో 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం విడుదలైంది. అందుతున్న ప్రాధమిక సమాచారాన్ని బట్టి ఈ చిత్రం తో కృష్ణవంశీ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లే అని తెలుస్తోంది. కథ చాలా ప్రెడిక్టుబుల్ గా ఉండి పాత వాసనలు కొట్టినా రామ్ చరణ్ ని కొత్తగా చూపటంలోనూ, విజువల్స్ ని అందంగా ప్రెజంట్ చేయటంలోనూ కృష్ణవంశీ సఫలీకృతుడయ్యాడంటున్నారు.

    ముఖ్యంగా రామ్ చరణ్ క్లైమాక్స్ లో చేసిన ఎమోషన్ సీన్ కు అందరూ ప్లాట్ అవుతున్నారు. రామ్ చరణ్ మేనరిజమ్స్, గెటప్, సింపుల్ గా వేసిన స్టెప్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కాజల్ సైతం అచ్చ తెలుగు అమ్మాయిని చూసినట్లు ఫీల్ వచ్చేలా ప్రెజెంట్ చేసారని తెలుస్తోంది. రామ్ చరణ్, కాజల్ ల మధ్య వచ్చే బావా మరదళ్ల సీన్స్ బాగున్నాయంటున్నారు.

    Ram Charan's Govindudu Andarivadele talk

    ఇక ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో మరోసారి తన విశ్వరూపం చూపాడంటున్నారు. తాతయ్యగా తన వయస్సుకు మించిన పాత్రను అవలీలగా జీవించాడని చెప్తున్నారు. అయితే సినిమా ఫస్టాఫ్ స్లోగా ఉందని, కామెడీ తగ్గిందని చెప్తున్నారు. శ్రీకాంత్ పాత్రకు జస్టిఫికేషన్ సైతం ఇవ్వలేదని అది కూడా ఇచ్చుంటే సినిమాకు మరింత నిండుతనం దొరికేది అంటున్నారు. సాంకేతికంగా అన్ని విభాగాలు అద్బుతంగా పనిచేసాయని టాక్.

    ఇక ఈ చిత్రం కథ...

    ఎన్నారై అభిరామ్(రామ్ చరణ్)కి చిన్నప్పటి నుంచి భారతీయ సంప్రదాయాలంటే మక్కువ. తన తండ్రి ద్వారా తన కుటుంబం విడిపోయిన తీరు తెలుసుకుని, దాన్ని సరిచేసి తన తండ్రి కళ్లల్లో ఆనందం చూడటానికి ఇండియా వస్తాడు. అక్కడ తన తాత బాలరాజు(ప్రకాష్ రాజ్) అనే గ్రామ పెద్ద కి తనెవరో చెప్పకుండా ఆ కుటుంబంలోకి ప్రవేశిస్తాడు. తన బాబాయ్ (శ్రీకాంత్) ని కలిసి అతని ప్రేమ సమస్యను తీరుస్తాడు. తన మనవడు అని తెలిసాక బాలరాజు ఎలా స్పందిచాడు. ఎలా తన కుటుంబంలో ఉన్న సమస్యలను తీర్చి కుటుంబాన్ని ఒకటి చేసాడు అనేది మిగతా కథ.

    English summary
    Ram Charan’s ‘Govindudu Andarivadele’ Benifit shows gets positive talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X