»   » రామ్ చరణ్ చిత్రంపై రూమర్ నిజమే

రామ్ చరణ్ చిత్రంపై రూమర్ నిజమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో బిజీగా ఉన్న రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ఫైనల్ చేసారని సమాచారం. ఈ చిత్రం అందరూ ఊహించినట్లుగానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉండనుంది. ఈ చిత్రం వేసవి తర్వాతే మొదలు కానుంది. గతంలోనే ఎప్పుడో రామ్ చరణ్ కి ఈ స్క్రిప్టు నేరేట్ చేసాడని, అయితే మార్పులు చెప్పాడని,ఇప్పుడు ఆ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. లెజండ్ విడుదల అయిన అనంతరం ఈ ప్రాజెక్టు ఎనౌన్స్ కానుంది.

ఇక ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ లేదా క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ వారు నిర్మిస్తారు. తమన్నా ని కాని సమంత గానీ ఈ చిత్రం లో హీరోయిన్ గా చేయనుంది. బోయపాటి రెగ్యులర్ గా రామ్ చరణ్ తో టచ్ లో ఉండి ప్రాజెక్టుని ఫైనలైజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఇక ఈ చిత్రంలో చరణ్ .. కాలేజీ స్టూడెంట్ గా కనపడనున్నారని సమాచారం.

Ram Charan's next with Boyapati

ఫస్టాఫ్ మొత్తం కాలేజీ స్టూడెంట్ గా కనిపిస్తాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. సెకండాఫ్ లో రివేంజ్ స్టోరీగా నడుస్తుందని,పైకి రెగ్యులర్ గా నడిచినా ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కొత్తగా ఉండి నిలబెడుతుందని అంటున్నారు. ఇప్పటికే చిరంజీవి ఈ కథ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని,స్క్రిప్టు వర్క్ జరుగుతోందని చెప్తున్నారు. లెజండ్ తర్వాత బోయపాటి ఈ స్క్రిప్టు పైనే పూర్తి దృష్టి పెట్టనున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. భద్ర, తులసి, సింహా లాంటి మాస్ చిత్రాల దర్శకుడు తో సినిమా చేయవటంతో మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడుతుందని భావిస్తున్నారు.


ప్రస్తుతం రామ్ చరణ్... హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. కాజల్‌ హీరోయిన్. శ్రీకాంత్‌, కమలిని ముఖర్జీ ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. బండ్ల గణేష్‌ నిర్మాత. ఈ చిత్రం రామ్ చరణ్ పుట్టిన రోజు అంటే మార్చి 27న ఫస్ట్ లుక్ విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 'గోవిందుడు అందరి వారేలే ' అనే టైటిల్ ని పెట్టే అవకాసం ఉందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామేశ్వరంలో జరుగుతోంది. చిత్ర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. సినిమాలో ఈ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయంటున్నారు.

నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ- ''కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు, తెలుగు సంప్రదాయాలు కలగలిపి తీర్చిదిద్దుకున్న కథ ఇది. సినిమాలో రామ్‌చరణ్‌ కొత్తగా కనిపిస్తాడు. శ్రీకాంత్‌ ఇందులో రామ్‌చరణ్‌కి యంగ్‌ బాబాయిగా కనిపిస్తారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. తమిళ నటుడు రాజ్‌కిరణ్‌ పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాగర్‌కోయిల్‌, పొల్లాచ్చిలోనూ త్వరలో చిత్రీకరణ జరుపుతాము''అన్నారు.

English summary
Ram Charan's next will be in the direction of Boyapati Srinivas. The film, an action entertainer with some romance will go to floors after Summer. Boyapati is ready with the script from long ago but few changes have been made to suit Charan. But there is no clarity on who will produce it. It is going to be either Durga Aarts or Creative Commercials. The Director is considering Tamannah and Samantha to play the female lead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu