»   » మెగా హీరో కన్ను సుకుమార్ పై

మెగా హీరో కన్ను సుకుమార్ పై

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సుకుమార్ కు సినిమా రిజల్ట్ లతో సంభందం లేకుండా ఆపర్స్ వస్తున్నాయి. మహేష్ బాబు తో చేసిన '1-నేనొక్కిడినే'చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినా తర్వాత ఎన్టీఆర్ పిలిచి ఆఫర్ ఇచ్చారు. నాన్నకు ప్రేమతో చిత్రం వచ్చింది. ఈ చిత్రానికి మిక్సెడ్ టాక్ వచ్చినా చాలా ఇంటిలిజెంట్ గా సినిమాని డీల్ చేసాడంటూ భాక్సాఫీస్ వద్ద టాక్ వచ్చింది. అయితేనేం ఈ రెండు సినిమాలకు ఓవర్ సీస్ లో మార్కెట్ ఓ రేంజిలో జరిగింది.

కలెక్షన్స్ అక్కడ కుంభవృష్టిలా కురిసాయి. దాంతో ఓవర్ సీస్ లో డల్ ఉన్న రామ్ చరణ్ కన్ను...ఈ హీరోపై పడిందని సమాచారం. క్లాస్ గా చూపిస్తూ, స్టైలిష్ యాక్షన్ కనిపించి, ఓవర్ సీస్ లో మార్కెట్ పెంచుకోవచ్చనే రామ్ చరణ్ వ్యూహంతో సుకుమార్ ని పిలుస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దానికి తోడు సుకుమార్ కు, మెగా క్యాంప్ కు ఉన్న అనుబంధం కూడా కలిసి వస్తుందని చెప్తున్నారు.

రామ్ చరణ్ కు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎలాగూ మార్కెట్ ఉంటుంది. ప్రక్క తమిళనాడులో మార్కెట్ కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఓవర్ సీస్ ప్రేక్షకులను ఆకర్షించాలని రామ్ చరణ్ కు ఉంటుంది. అందుకోసం సుకుమార్ వంటి దర్శకులు తప్పనిసరి అంటున్నారు. సుకుమార్ సినిమాలకు ఇక్కడ కన్నా అక్కడే బాగా ఆదరణ ఉంది. ముఖ్యంగా యుఎస్ లో సుకుమార్ సినిమాలకు మంచి స్పందన ఉంది.

Ram Charan's next withSukumar?

దాంతో ఓవర్ సీస్ లో మంచి బిజినెస్ జరుగుతోంది. దానికితగినట్లే సుకుమార్ కూడా చాలా స్టైలిష్ గా ఎక్కువ లండన్ వంటి ప్రాంతాల్లోనే సినిమాను రూపొందిస్తున్నారు. సుకుమార్ ఇంటిలిజెంట్ ధాట్స్ కు, సైన్స్ తో కూడిన సీన్స్ కు అక్కడ మంచి అప్లాజ్ వస్తోంది. సుకుమార్ కూడా ఓవర్ సీస్ లో తన సినిమాలు బాగా ఆడటాన్ని ఒప్పుకున్నారు.

త్వరలోనే రామ్ చరణ్ ఈ చిత్రాన్ని చూస్తారని చెప్తున్నారు. రామ్ చరణ్ తో చెయ్యాలని సుకుమార్ కు కూడా ఎప్పటినుంచో ఉంది. అయితే అందుకు తగిన కథకోసం ఆయన అన్వేషిస్తున్నారట. చూడాలి మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో.

English summary
Probably Ram Charan wants to do something different like Sukumar’s “Intelligent movies” to regain his grip in Overseas market.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu