»   » వరుణ్ తేజ 'రాయబారి' ఆగటానికి కారణం రామ్ చరణ్?

వరుణ్ తేజ 'రాయబారి' ఆగటానికి కారణం రామ్ చరణ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుణ్ తేజ, క్రిష్ కాంబినేషన్ లో అనుకున్న రాయబారి చిత్రం ఆగిపోయిన సంగతి తెలిసిందే. బడ్జెట్ కారణాలతో ఆగిపోయిందని చెప్తున్నా..అసలైన కారణం వేరే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినపడుతోంది.

అందుతున్న సమాచారం ప్రకారం ..రామ్ చరణ్ ఈ ప్రాజెక్టు ఆపుచేయటం వెనుక ఉన్నట్లు చెప్తున్నారు. వరుణ్ తేజ కెరీర్ భాధ్యతలు తీసుకున్న రామ్ చరణ్, అతని టీమ్ మొదటగా ఈ ప్రాజెక్టుని ఆపుచేయించిందని అని చెప్పుకుంటున్నారు. దానికి కారణం ..ఇక నుంచి వరుణ్ తేజను మాస్ ఇమేజ్ వైపుగా నడపాలనే ఆలోచన అని చెప్తున్నారు.

మెగా క్యాంప్ నుంచి వచ్చిన హీరోలంతా దాదాపు సక్సెస్ అయ్యారు. కానీ అదేంటో...వరుణ్ తేజ మాత్రం పెద్దగా క్లిక్ అవ్వలేదు. దాంతో రామ్ చరణ్ ఇప్పుడు తన సోదరుడుపై దృష్టి పెట్టినట్లు సమాచారం. దాంతో అతని వ్యవహారాలు మొత్తం తన టీమ్ కు అప్పచెప్పినట్లు సమాచారం.

Ram Charan’s team behind scrapping ‘Raayabari’

ముకుందా, కంచె మరియు లోఫర్ సినిమాలు రిజల్ట్ చూసిన నాగబాబు తన కుమారుడు గురించి రామ్ చరణ్ వద్ద మాట్లాడాడని అంటున్నారు. దాంతో మాస్ హీరోగా అయితేనే , భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అవుతాడని, సాయి ధరమ్ తేజలా దూసుకుపోతాడని చెప్పినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా వరుణ్ తేజను నిలబెట్టడం కోసం తమ కుటుంబం ఖచ్చితంగా పనిచేస్తామని మాట ఇచ్చాడని, అందుకే తన టీమ్ కు వరుణ్ తేజ డేట్స్ ,ఫ్రొపిషనల్ మ్యాటర్స్,దర్శకులతో మీటింగ్స్ అన్నీ ఏర్పాటు చేసేందుకు ఆ టీమ్ కృషి చేస్తుంది. అంతేకాదు రామ్ చరణ్ స్టోరీ టీమ్ సైతం ఇక నుంచి వరుణ్ తేజ కోసం పనిచేయనుందని తెలుస్తోంది. అందులో భాగమే రాయబారి చిత్రం ఆపుచేయటం.

English summary
Ram Charan wants Varun to get a mass image and it is said that this is the reason behind the scrapping of Krish’s ‘Raayabari’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu