RC15: రామ్ చరణ్ పాత్రపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.. అలాంటి హై వోల్టేజ్ కథను సెట్ చేసుకున్న శంకర్

సౌత్ ఇండస్ట్రీలో రూపొందుతున్న బిగ్గెస్ట్ మూవీస్ లలో రామ్ చరణ్ 15వ ప్రాజెక్ట్ ఒకటి. సంచలన దర్శకుడు శంకర్ తెరకెక్కించనున్న ఆ సినిమా కథపై గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక రీసెంట్ గా మరొక ఇంట్రెస్టింగ్ విషయం అయితే లీక్ అయ్యింది. ముఖ్యంగా రామ్ చరణ్ పాత్ర చాలా బాధ్యతాయుతంగా ఉంటుందట. ఆ వివరాల్లోకి వెళితే..

రామ్ చరణ్ తో చేయడానికి కారణం..

రామ్ చరణ్ తో చేయడానికి కారణం..

దర్శకుడు శంకర్ మొత్తానికి ఇండియన్ 2ను పక్కనపెట్టి పూర్తిగా రామ్ చరణ్ 15వ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు. ఈ కథలో కూడా సామాజిక అంశాలు గట్టిగానే ఉంటాయట. అయితే ఈ కథ కోసం రామ్ చరణ్ ను ఎంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందట. రంగస్థలం సినిమా చూసి శంకర్ అందులో చరణ్ నటనకు ఫిదా అయ్యాడు. ఎలాగైనా సినిమా చేయాలని గత ఏడాది నుంచి ప్లాన్ చేసుకుంటున్నాడట.

 శంకర్ సినిమాకు.. అందుకే గ్రీన్ సిగ్నల్..

శంకర్ సినిమాకు.. అందుకే గ్రీన్ సిగ్నల్..


అసలైతే శంకర్ తో మెగాస్టార్ సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నారు కానీ కుదరలేదు. ఇక ఈ సారి ఆయన కొడుకుతో చేయడం విశేషం. RRR అనంతరం మళ్ళీ అదే తరహాలో సినిమా ఉండాలని రామ్ చరణ్, శంకర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఆ కథను రాసింది ఎవరంటే

ఆ కథను రాసింది ఎవరంటే


ఈ ప్రాజెక్ట్ మొదట ఒకే ఒక్కడు సినిమాకు సీక్వెల్ గా రాబోతున్నట్లు టాక్ అయితే వచ్చింది. నిజానికి కథ వేరైనా కాన్సెప్ట్ మాత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందట.
ఇక సినిమా మూల కథను యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు అందించినట్లు తెలుస్తోంది. శంకర్ ఆ కథను పూర్తిగా తన స్టైల్ కు మార్చుకొని నేటి సామాజిక అంశాలను హైలెట్ చేయనున్నాడట. మాటలను సాయి మాధవ్ బుర్ర అంధించనున్నాడు.

ఐఏఎస్ ఆఫీసర్ నుంచి సీఎంగా..

ఐఏఎస్ ఆఫీసర్ నుంచి సీఎంగా..

ఇక కథలో రామ్ చరణ్ పాత్రపై ప్రస్తుతం ఒక గాసిప్ వైరల్ అవుతోంది. ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్న ఒక యువకుడు అనంతరం ముఖ్యమంత్రి అవుతాడట. అయితే సీఎంగా అతను ఎదుర్కొన్న అనుభవాలు, ఆచరణలో పెట్టిన సరికొత్త సామాజిక ప్రణాళికలు ఎలా ఉంటాయనేది సినిమా అసలు కథ అని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సినిమాకు సంబంధించిన నటీనటులను సెలెక్ట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X