»   » చిరంజీవి కూతురు సైతం నిర్మాతగా....

చిరంజీవి కూతురు సైతం నిర్మాతగా....

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ కొత్త ట్రెండ్ మొదలయ్యింది. అదేంటంటే...హీరోలైన తమ సోదరులతో సినిమాలు నిర్మిస్తూ బిజిగా ఉండటం. మంజుల తన సోదరుడు మహేష్ తో సినిమ చేస్తోంది. అలాగే నాగసుశీల తన సోదరుడు నాగార్జునతో సినిమా చేస్తోంది. ఇక మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న కూడా విష్ణు, మనోజ్ లతో సినిమా చేస్తోంది. వీటిన్నటినీ గమనించిన రామ్ చరణ్ సోదరి సుస్మిత కూడా నిర్మాతగా రంగంలోకి దిగనుంది. ఆమె భర్త చెన్నైకి చెందిన ఓ పెద్ద బిజెనెస్ మాగ్నెట్. అతనితో పెట్టుబడి పెట్టించి సోదరుడు రామ్ చరణ్ హీరగా సినిమా చేయనుంది. ఈ విషయానికి చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే గీతా ఆర్ట్స్, అంజనా ప్రొడక్షన్స్ కు తోడుగా మరో నిర్మాణ సంస్ద చిరు ఫ్యామిలీనుంచి రానుందన్నమాట. ఇక ఆమె నిర్మించబోయే చిత్రం రామ్ చరణ్ నెక్ట్స్ చిత్రం అంటున్నారు. తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలోఈ చిత్రం రూపొందనుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో వచ్చే ఆ సినిమా సూపర్ మేన్, హృతిక్ రోషన్ క్రిష్ తరహా కథనంతో ఉంటుందని చెప్తున్నారు.ఇక ధరణి ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ తో బంగారం చిత్రం రూపొందించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu