»   » సుకుమార్, రామ్ చరణ్ చిత్రం : బడ్జెట్ అంతా? ,వర్కవుట్ అవుద్దా?

సుకుమార్, రామ్ చరణ్ చిత్రం : బడ్జెట్ అంతా? ,వర్కవుట్ అవుద్దా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అప్పట్లో ఎన్టీఆర్ తో చేసిన సినిమా నాన్నకు ప్రేమతో ప్రారంభానికి ముందు ఆలస్యమవడంతో ఈ గ్యాప్ లో కుమారి 21 ఎఫ్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసిన సుకుమార్.. మరోవైపు ఓ స్టార్ హీరోకు కూడా స్టోరీ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు రెడీ చేసుకున్న కథనే ఇప్పుడు రామ్ చరణ్ తో చేయబోతున్నాడట. ఆ చిత్రం బడ్జెట్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

ఈ సినిమాని నిర్మించనున్న మైత్రీ మూవీస్ వారికి ఈ చిత్రం బడ్జెట్ 70 కోట్లు అని సుకుమార్ చెప్పాడని సమాచారం. అయితే రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ ఎంత క్రేజ్ వస్తుంది. దానిపై ఎంత లాభం వేసుకుని అమ్మాలి అనే లెక్కలు వేస్తే మొత్తం అన్ని కలిపి వంద కోట్లకు రిలీజ్ కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగలిగితేనే ఫలితం ఉంటుందని భావించారట నిర్మాతలు. దాంతో నిర్మాతలు కాస్త కంగారుపడటంతో నిర్మాతలను రామ్ చరణ్ దగ్గరుండి ఒప్పించినట్లు సమాచారం.

ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సురేంద్రరెడ్డితో తెరకెక్కిస్తున్న తని ఒరువరన్ రీమేక్ సినిమా పూర్తవగానే.. రామ్ చరణ్ ఈ సినిమాపై దృష్టి సారించనున్నాడు. ఈలోగా సుకుమార్ తన స్నేహితుడు హరిప్రసాద్ దర్శకత్వంలో తన అన్నకుమారుడు అశోక్ హీరోగా డైరక్టర్ అనే చిత్రం నిర్మించనున్నారు. మొత్తానికి దర్శకుడిగా స్టార్ హీరోల సినిమాతో బిజీగా ఉంటూనే.. మరోవైపు నిర్మాతగానూ ట్రై చేస్తున్న సుకుమార్ కు.. ఈ సారి ఎలాంటి ఫలితం లభిస్తుందో చూడాలి..అంటోంది ఇండస్ట్రీ.

Ram Charan-Sukumar film Budget?

ఇక 'బ్రూస్‌లీ' సినిమా డిజాస్టర్ ఫలితం తర్వాత తమిళ చిత్రం తనీ ఒరువన్ తెలుగు రీమేక్‌ ధృవ లో నటిస్తున్న రామ్ చరణ్ ఈ సారి ఆచితూచి అడుగులు వేస్తున్నాడట. సుకుమార్ అంటేనే...రోటీన్ సినిమాలకు భిన్నంగా ఆలోచించే దర్శకుడు. కెరీర్లో ఇప్పటి వరకు చాలా ప్రయోగాలు చేసిన సుకుమార్ ఈ సారి చెర్రీ మీద 'ఫార్ములా ఎక్స్'ప్రయోగం చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాకు సంగీతం కూడా దేవిశ్రీ ప్రసాద్ అందిస్తాడని తెలుస్తోంది. ఈ మధ్య రామ్ చరణ్ రొటీన్ కమర్షియల్ సినిమాలు చేసి బోల్తా పడుతున్నారు. అందుకే ఈసారి తెగింపు నిర్ణయం తీసుకున్నాడని, సుకుమార్ తో ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నాడని అంటున్నారు.

ప్రస్తుతం సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ధృవ సినిమాతో చెర్రీ బిజీగా ఉండగా, సుకుమార్ తన సినిమాకు ప్రీప్రొడక్షన్, స్క్రిప్ట్ పనులు పూర్తిచేస్తున్నాడట. ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం. ఈ ఏడాది ఆగస్టు లేదా, సుప్టెంబర్లో సినిమా ప్రారంభం అవుతుందని టాక్.

English summary
Ram Charan asked director Sukumar to come up with another budget plan as he got shocked when the director carved out a 70 crore budget plan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu