»   » రామ్ చరణ్ నెక్ట్స్ ఖరారు...దర్శకుడు ఎవరంటే

రామ్ చరణ్ నెక్ట్స్ ఖరారు...దర్శకుడు ఎవరంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం శ్రీనువైట్ల తో మై నేమ్ ఈజ్ రాజు చిత్రం చేస్తున్న రామ్ చరణ్ తన తదుపరి చిత్రానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఆ దర్శకుడు మరెవరో కాదు సురేంద్రరెడ్డి. ప్రస్తుతం కిక్ 2 చిత్రం పూర్తి చేసి, విడుదలకు సిద్దం చేస్తున్న సురేంద్రరెడ్డి ..రీసెంట్ గా రామ్ చరణ్ ని కలిసి ...మాట్లాడారని తెలుస్తోంది. మై నేమ్ ఈజ్ రాజు చిత్రం ఎబ్రాడ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత రామ్ చరణ్ ఈ ప్రాజెక్టుపై కూర్చూంటారు. అక్టోబర్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై...2016 ప్రారంభంలో రిలీజ్ అవుతుంది.

ఇక ఈ చిత్రం కథ గోపీ మోహన్, కోన వెంకట్ ఇచ్చిందని తెలుస్తోంది. వీరు చెప్పిన కథ గతంలో రామ్ చరణ్ ..గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నారు. అయితే దర్శకుడు ఎవరనేది ఖరారు కాలేదు. లక్ష్యం వాసు..అప్పుడే లౌక్యం తీసి హిట్ కొట్టడంతో అతన్ని రామ్ చరణ్ తో సినిమాకు రెడీ చేద్దామనుకున్నారు. అయితే అనుకున్నట్లుగా ముందుకు వెళ్లలేదు. ఈ లోగా శ్రీను వైట్ల ప్రాజెక్టు మెటీరియలైజ్ అయ్యి ముందుకు వెళ్తోంది. ఆ కథ అలా ఉండిపోయింది.

తర్వాత సురేంద్ర రెడ్డితో ఎప్పటినుంచో చేద్దామనుకున్న రామ్ చరణ్...ఆ కథని సురేంద్ర రెడ్డి కు చెప్పించటం జరిగింది. వెంటనే సురేంద్ర రెడ్డి ఓకే చేసి తన దైన స్క్రీన్ ప్లే శైలితో మరింతగా ఈ కథను పదునెక్కించి...రామ్ చరణ్ కు వినిపించి ఒప్పించింది. మేకింగ్ స్టైల్, స్క్రీన్ ప్లే ..సాధారణ కథను అందంగా చెప్పగల సురేంద్ర రెడ్డి ..కోన వెంకట్ కథ ను ఎంత బాగా తెరకెక్కిస్తాడో అని ఎదురుచూస్తున్నారు.

Ram Charan-Surender Reddy’s film is confirmed

ప్రస్తుతం రామ్ చరణ్ చిత్రాల వివరాలకి వెళ్తే...

రామ్‌చరణ్‌ హీరోగాగా డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత.

దర్శకుడు మాట్లాడుతూ ''యాక్షన్‌తో కూడిన కుటుంబ కథా చిత్రమిది. భారీ తారాగణంతో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమా తెరకెక్కిస్తాం'' అన్నారు.

Ram Charan-Surender Reddy’s film is confirmed

నిర్మాత మాట్లాడుతూ ''విజయవంతమైన కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం అందరినీ అలరించేలా ఉంటుంది. శ్రీనువైట్ల మూల కథ అందించారు. '' అన్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్‌, గోపీమోహన్‌ది విజయవంతమైన కాంబినేషన్‌ అనీ, ఆ కాంబినేషన్‌తో ఈ సినిమా రూపొందుతుండటం ఆనందంగా ఉందని నిర్మాత దానయ్య అన్నారు.

ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
Ram Charan’s next with Surender Reddy is confirmed. Shooting will start in October and film will release in early 2016.
Please Wait while comments are loading...